ETV Bharat / city

రీపోలింగ్​కు విశాఖ ఉత్తర స్వతంత్ర అభ్యర్థి విజ్ఞప్తి

ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విశాఖ ఉత్తర నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి వడ్డీ హరి గణేష్ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ఫలితాలను నిలిపివేసి రీపోలింగ్​ నిర్వహించాలని కోరారు.

విశాఖ ఉత్తరంలో రీపోలింగ్ జరపాలని పిటిషన్
author img

By

Published : May 1, 2019, 5:09 PM IST

విశాఖ ఉత్తరంలో రీపోలింగ్ జరపాలని పిటిషన్

విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎన్నికల ఫలితాలను నిలిపివేసి.. రీపోలింగ్ జరపాలని ఆ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వడ్డీ హరి గణేష్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో పది పోలింగ్ బూత్​లలో అవకతవకలు జరిగాయని ఆరోపించిన గణేష్​.. ఈవీఎంలు మొరాయించడం వల్ల చాలా పోలింగ్ బూత్​లలో ఆలస్యంగా ఓటింగ్ మొదలైనా... సాయంత్రం ఆరు గంటలకే గేట్లు మూసివేశారని పేర్కొన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా చేశారని పిటిషన్​లో పేర్కొన్నారు. ఉదయం జరిగిన మాక్​ పోలింగ్​లో కొన్ని స్లిప్పులను బయటకు తీయకుండా.. ఈవీఎంలను రీసెట్ చేయకుండా వదిలేయడంతో రెగ్యులర్ ఓట్లతో మాక్ పోలింగ్ ఓట్లు కలిసిపోయాయని పిటిషన్​లో వెల్లడించారు. ఎన్నికల అధికారుల తప్పిదాల వల్ల అనేకమంది తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఫలితాలను నిలుపుదల చేసి రీపోలింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.