విశాఖలోని డీజిల్ లోకోషెడ్‌లో రైల్వే గ్రేడ్-1 టెక్నీషియన్‌గా విజయకుమార్ పని చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి చిత్రలేఖనంపై మక్కువ ఎక్కువ. విధి నిర్వహణలో బిజీబిజీగా ఉన్నా... తనకున్న ఆసక్తిని వదల్లేదు. తీరిక దొరికినప్పుడల్లా వివిధ రకాలు చిత్రాలు వేస్తున్నారు. తను చూసిన, తనను కదిలించిన ప్రతి సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. చార్‌కోల్, వాటర్ కలర్స్, ఆయిల్ పెయింటింగ్‌తో అపురూపమైన చిత్రాలు గీస్తూ వీక్షకులను ఆలోచింపజేస్తున్నారు. ఇలా ఆయన చేతినుంచి జాలువారే కళాఖండాలు అబ్బురపరుస్తున్నాయి.
అంతర్జాతీయ వేదిలకపై ప్రదర్శనలు...
వాల్తేరు డివిజన్ 125 ఏళ్ల వేడుకల్లో విజయకుమార్ వేసిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. డీఆర్ఎం కార్యాలయంలో ఆర్ట్ గ్యాలరీలోని చిత్రాలన్నీ ఈయన చేత వేయించారు. విజయకుమార్ తన చిత్ర కళతో అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకుంటున్నారు. ఆయన ప్రతిభకు మెచ్చి 2017లో అప్పటి తానా అధ్యక్షుడు సతీష్ వేమన తెలుగు మహాసభల్లో ప్రదర్శన ఇచ్చే అవకాశమిచ్చారు. 2019లో అట్లాంటాలో నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్... 300మంది పిల్లలతో ప్రత్యేక శిబిరాన్నే ఏర్పాటు చేయించింది. విజయకుమార్ చిత్రకళకు ముగ్దులైన అమెరికాలోని తెలుగుసంఘాలు అనేక అవార్డులతో సత్కరించాయి.
విద్యార్థులకు శిక్షణ...
చిత్రకళలోని కొత్త కోణాన్ని ప్రపంచానికి చూపించడంతోపాటు... ఆ తరహాలో మరింతమంది వెలుగులోకి వచ్చేలా విద్యార్థులకు, పెద్దలకు శిక్షణిస్తున్నారు విజయకుమార్. దేశ విదేశాలకు చెందిన 50 మంది విద్యార్థులకు ఆన్‌లైన్‌లో చిత్రకళాపోటీలు పెట్టి అవార్డులు అందజేశారు.
ఇవీచదవండి.