ETV Bharat / city

విశాఖలో 11 కరోనా పాజిటివ్​ కేసులు.. యంత్రాంగం అప్రమత్తం - corona status in ap

రాష్ట్రంలో కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం వైరస్​ వ్యాప్తి నివారణకు పటిష్ట చర్యలు చేపట్టింది. విశాఖలో 11 కేసులు నమోదు కావడంపై అప్రమత్తమైన జిల్లా కలెక్టర్​.. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. మొత్తం 333 మంది అనుమానితులను పరీక్షించగా 11 మందికి పాజిటివ్​.. 190 మందికి నెగిటివ్​గా వచ్చినట్లు కలెక్టర్​ తెలిపారు. మరో 132 మంది ఫలితాలు రావాల్సి ఉందని చెప్పారు.

విశాఖలో 11 కరోనా పాజిటివ్​ కేసులు.. యంత్రాంగం అప్రమత్తం

author img

By

Published : Apr 2, 2020, 11:54 PM IST

విశాఖలో ఇప్పటివరకూ 11 కరోనా పాజిటివ్​ కేసులు నమోదు కావడంపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దిల్లీ నుంచి వచ్చిన వారిని గుర్తించిన అధికారులు దాదాపు అందరికీ పరీక్షలు నిర్వహించారు. కరోనా బాధితులను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో మొత్తం 53 క్వారంటైన్​లో 8,912 పడకలు సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకూ 153 మంది క్వారంటైన్​లో ఉన్నట్లు తెలిపారు. కరోనా అనుమానంతో 273 మంది ఆస్పత్రుల్లో చేరగా.. వారిలో 163 మందిని డిశ్చార్జ్​ చేసినట్లు చెప్పారు.

పాజిటివ్ కేసుల వివరాలు

విశాఖలో ఇప్పటివరకూ 333 అనుమానితులకు పరీక్షలు చేయగా.. వారిలో 11 మందికి పాజిటివ్, 190 మందికి నెగిటివ్ వచ్చింది. మరో 132 మంది ఫలితాలు రావాల్సి ఉంది. కరోనా పాజిటివ్​ కేసులు వచ్చిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య సిబ్బంది శుభ్రత చర్యలు చేపట్టారు. కరోనా వ్యాప్తి నివారణకు కమిటీలు ప్రత్యేకంగా పని చేస్తున్నట్లు కలెక్టర్​ వినయ్​ చంద్​ తెలిపారు. జిల్లాలో కొవిడ్ ఆస్పత్రిగా.. పెద్ద వాల్తేరులోని ఛాతి ఆసుపత్రి , గీతం వైద్య విద్యాలయాలు సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. నిత్యావసరాల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నట్లు చెప్పారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని కలెక్టర్​ సూచించారు.

ఇదీ చూడండి:

నిత్యావసరాలు అందించేందుకు ముందుకొస్తున్న దాతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.