విశాఖలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయం ఏర్పాటుకు అవకాశాన్ని పరిశీలించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తెలిపింది. ఈ మేరకు పరిశీలించిన వాటిలో ఒకదాన్ని రాష్ట్ర ప్రభుత్వం లీజుకు తీసుకునే అవకాశాన్ని పరిశీలించాలని బోర్డు కోరింది. ప్రస్తుతం హైదరాబాద్ జలసౌధలో ఇస్తున్న తరహాలోనే ఉచితంగా వసతిని వైజాగ్‌లోనూ కల్పించాల్సిన అవసరం ఉందని... ఉచిత వసతికి సంబంధించిన సమాచారం తమకు ఇంకా అందలేదని బోర్డు పేర్కొంది.
కార్యాలయాన్ని వీలైనంత త్వరగా విశాఖకు మార్చాలని కేంద్ర జలశక్తి శాఖ కోరుతున్నందున... వీలైనంత త్వరగా సంబంధిత సమాచారం ఇవ్వాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయమై బోర్డు సభ్య కార్యదర్శి హరికేశ్ మీనా.. రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. బోర్డుకు చెందిన ఇంజనీర్ల బృందం.. ఏప్రిల్ మొదటి వారంలో విశాఖలో పర్యటిస్తుందని లేఖలో తెలిపారు.
ఇదీ చూడండి:
రేపు విజయవాడకు సీఎం.. రిటెయినింగ్ వాల్ నిర్మాణానికి శుంకుస్థాపన