ETV Bharat / city

Quarries Pollution in Visakha : క్వారీల్లో తవ్వకాలు.. కాలుష్యం కోరల్లో స్థానికులు..! - క్వారీ తవ్వకాలతో విశాఖలో కాలుష్యం

Excavations at quarries in Visakha : విశాఖ జిల్లాలో క్వారీ తవ్వకాలు వాతావరణానికి పెనుముప్పుగా మారుతున్నాయి. నిర్వాహకులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో చుట్టు పక్కల గ్రామస్థులు పలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. పెద్దఎత్తున వాహనాల రాకపోకలు సాగిస్తుండటంతో దుమ్ము, ధూళితో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఈ క్వారీలవైపు అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడంతో స్థానికులకు తిప్పలు తప్పడం లేదు.

Excavations at quarries in Visakha
క్వారీల్లో తవ్వకాలు..కాలుష్యం కోరల్లో స్థానికులు...
author img

By

Published : Feb 13, 2022, 2:54 PM IST

Excavations at quarries in Visakha : విశాఖ జిల్లాలో క్వారీ తవ్వకాలు వాతావరణానికి పెనుముప్పుగా మారుతున్నాయి. నిర్వాహకులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో చుట్టు పక్కల గ్రామస్థులు పలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. పెద్దఎత్తున వాహనాల రాకపోకలు సాగిస్తుండటంతో దుమ్ము, ధూళితో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఈ క్వారీలవైపు అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడంతో స్థానికులకు తిప్పలు తప్పడం లేదు.

క్వారీల్లో తవ్వకాలు..కాలుష్యం కోరల్లో స్థానికులు...

విశాఖ జిల్లా నాతవరం మండలంలోని బమిడికలొద్ది క్వారీలో ప్రతిరోజూ వేల క్యూబిక్‌ మీటర్ల లేటరైట్‌ తవ్వకాలు చేపడుతున్నారు. వందల టన్నులు కడప, కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లోని సిమెంటు కంపెనీలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో క్వారీ ప్రాంతం నుంచి దారి పొడువునా పరిసరాలన్నీ కాలుష్యమైపోతున్నాయి. నీటి వనరులు దెబ్బతినడంతో పాటు ఇళ్లల్లోకి దుమ్ము, ధూళి వచ్చి చేరుతున్నాయి.

ఇదీ చదవండి: పంచాయతీల్లో తాగునీటి పథకాల నిర్వహణ అస్తవ్యస్తం

Quarries Pollution in Visakha : లేటరైట్‌ తవ్వకాలు స్థానిక గ్రామాల ప్రజలకు అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. బమిడికలొద్ది కొండపై ఇప్పటికే 121 హెక్టార్లలో లేటరైట్‌ తవ్వడానికి, తరలించడానికి క్వారీ నుంచి భారీ రహదారి నిర్మాణం చేపట్టారు. ఎలాంటి అనుమతులూ తీసుకోకుండానే వేలాది చెట్లు నేలకూల్చారని విమర్శలూ వచ్చాయి. తాజాగా లేటరైట్‌ రవాణాతో కాలుష్యం కారణంగా రహదారి పక్కనున్న పచ్చని వనాలన్నీ ఎర్రగా మారిపోయాయి. పూతతో కళకళలాడాల్సిన జీడిమామిడి తోటలు... ఎర్రటి మట్టితో నిండిపోయి కాపు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దుమ్ము, ధూళి వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు.

"ఈ తవ్వకాలతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దుమ్ము ధూళి నిండి శ్వాసకోశ పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇరుకు రోడ్లపైనే లారీలతో తవ్విన వాటిని తరలిస్తున్నారు. దుమ్ము ధూళి ఇళ్లలోకి చేరి మాకు ఆరోగ్య పరమైన సమస్యలు వస్తున్నాయి. చిన్న వయసులోనే ఆయాసం, దగ్గు,ఊపిరితిత్తుల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. మందులు వాడినా ఫలితం కనిపించడం లేదు." - సన్యాసమ్మ , పైడిపాల గ్రామం

ఇదీ చదవండి: Substandard Fertilizers : ‘నిర్జీవ’ ఎరువులు.. రైతుల కష్టానికి తెగుళ్లు..

క్వారీలో తవ్విన లేటరైట్‌ను జల్దాం, పైడిపాల, రౌతులపూడి మీదుగా తరలిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని పైడిపాల చుట్టూ ఇప్పటికే రాతి క్వారీలు, క్రషర్లు ఉన్నాయి. వాటి కాలుష్యంతోనే సతమతమవుతుంటే... ఇప్పుడు అదనంగా లేటరైట్‌ వచ్చి చేరింది. గ్రామం నడిమధ్య నుంచి రోజూ వందలాది లారీలు వెళ్తుండడంతో దుమ్ము, ధూళి అంతా ఇళ్లల్లోకే వస్తోంది. తాగేనీరు, తినే తిండిలోనూ ఈ ధూళి కలిసిపోయి ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇటీవల ఓ లేటరైట్‌ లారీ అదుపుతప్పి ఏకంగా ఓ ఇంటిపైకి వెళ్లడంతో ఆందోళనకు దిగారు. అధికారులు స్పందించి కాలుష్య కోరల నుంచి రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

"రాత్రి పగలు తేడా లేకుండా తవ్వకాలు జరపడం, లారీల్లో తరలించడం వలన తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నాము. దీంతో దుమ్ము ధూళి ఇళ్లలోకి చేరి శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి. ఈ శబ్ధాలు, దుమ్ము ధూళి కాలుష్యంతో చిన్నపిల్లలు, పెద్దవాళ్లు అంతా నిద్ర కూడా నిద్రకు దూరం అవుతున్నారు.ఇళ్లలోకి వాహనాలు దూసుకు వస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు." -రామలక్ష్మి , స్థానికురాలు

" ఈ దుమ్ముధూళి మొత్తం మేమే తింటున్నట్టుగా పరిస్థితి ఉంది. తవ్వకాలను తరలించే వాహనాల శబ్ధాలకు కనీసం నిద్ర కూడా పోలేని స్థితిలో ఉన్నాం. శ్వాస, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నాం. మా అవస్థల గురించి ఎవరికీ పట్టదు.కనీసం మా పరిస్థితిని ఆలోచించే వారే కరువయ్యారు" - నాగేశ్వరరావు, పైడిపాల

ఇదీ చదవండి: కన్నుల విందుగా శ్రీ మహాలక్ష్మి తల్లి జాతర మహోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.