విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణే ధ్యేయంగా ఆదివారం పలు రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు ఆందోళనలు చేశారు. ప్రైవేటీకరణను నిరసిస్తూ తెదేపా ప్రత్యేక కార్యాచరణతో ఉద్యమం చేపడుతుందని ఆ పార్టీ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు త్వరలోనే విశాఖ రానున్నారని, ఆయన నాయకత్వంలో ప్రత్యక్ష పోరాటానికి దిగుతామన్నారు. మాజీ కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మహిళలు కూర్మన్నపాలెంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
- కేంద్రం తీరుకు వ్యతిరేకంగా జనసేన ఉద్యమ బాటలో సాగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని జనసేన రాష్ట్ర పీఏసీ సభ్యుడు, గాజువాక ఇన్‌ఛార్జి కోన తాతారావు డిమాండు చేశారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేతృత్వంలో త్వరలోనే దిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా ఒప్పిస్తామన్నారు.
- ఈ నెల 12 నుంచి నిరవధిక నిరాహార దీక్షలు చేస్తామని, 18న ఉక్కు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యాజమాన్యం నిర్వహించే కార్యక్రమాలను బహిష్కరిస్తామని ఉక్కు అఖిలపక్ష కార్మిక నాయకులు ప్రకటించారు.
ఇదీచదవండి