ETV Bharat / city

వేర్వేరు జిల్లాల్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత

author img

By

Published : Jan 12, 2021, 10:07 PM IST

రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని, వీరి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలు విశాఖపట్నం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జరిగాయి.

police-seize-cannabis-smuggled-in-srikakulam-and-west-godavari-visakhapatnam-districts
వేర్వేరు జిల్లాల్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత

విశాఖపట్నం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్రమంగా వాహణాల్లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

విశాఖపట్నంలో 154 కిలోలు..

విశాఖ ఏజెన్సీ నుంచి అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గుట్టుగా కొనుగోలు చేసి.. కేరళకు లారీలో తరలించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పక్కా సమాచారంతో నాల్గవ పట్టణ పోలీసులు వీరిని విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద పట్టుకున్నారు. నిందితుల నుంచి 154 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 15 లక్షలు ఉంటుందని ఈస్ట్ జోన్ ఏసీపీ హర్షిత చంద్ర తెలిపారు. వీరి వద్ద నుంచి కారు, లారీ, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

అలాగే మరో కేసులో ఫిషింగ్ హార్బర్ వద్ద ఉన్న మోడ్రన్ ఫిషింగ్ మార్కెట్లోని 130 స్టీల్ కుళాయిలు, ఇతర సామగ్రిని ఇద్దరు వ్యక్తులు దొంగలించారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు వీరిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ. 75 వేల విలువ చేసే సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

శ్రీకాకుళంలో 130 కేజీలు..

శ్రీకాకుళం జిల్లా పలాస జాతీయ రహదారిపై 30 కిలోల గంజాయిని కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారు. వ్యానును ఒడిస్సా వైపు తరలిస్తుండగా పోలీసులకు అనుమానం వచ్చి వాహనాన్ని తనిఖీ చేయగా.. గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఈ దాడులను తహసీల్దార్ మధుసూదన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

పశ్చిమ గోదావరిలో వెయ్యి కేజీలు..

పశ్చిమ గోదావరి జిల్లా, లింగపాలెం మండలం, ధర్మాజీగూడెంలో అరటి గెలల లారీలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వీటిని విశాఖ జిల్లా నర్శిపట్నం నుంచి మహారాష్ట్ర వైపు జహీరాబాద్​కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సుమారు కోటి రూపాయల విలువ చేసే వెయ్యి కేజీల గంజాయిని పట్టుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అరటి గెలల మధ్యలో గంజాయిని తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో లారీని ఆపి డ్రైవర్​ని అదుపులోకి తీసుకున్నట్లు జంగారెడ్డి గూడెం డీఎస్పీ రవి కిరణ్ తెలిపారు. లారీని ఎవరూ ఆపకుండా.. ఇన్నోవా కారులో నలుగురు వ్యక్తులు లారీ వెనుక వస్తున్నారని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లారీని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అలాగే కారులో ప్రయాణిస్తున్న మహారాష్ట్రకు చెందిన నలుగురిని, లారీలోని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అసలు సూత్రధారిని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

ఇదీ చదవండి: 900 కిలోల గంజాయి పట్టివేత...ఒకరు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.