ETV Bharat / city

బ్యాట్​ పట్టిన పోలీసులు... బంతి విసిరిన జర్నలిస్టులు..! - latest news on police,journalists at vizag

విధి నిర్వహణలో ఎప్పుడూ బిజీగా ఉండే పోలీసులు, జర్నలిస్టులు సరదాగా ఆటగాళ్ల అవతారమెత్తారు. విశాఖ నగర పోలీసులు, జర్నలిస్టుల క్రికెట్ ఆడారు. ఈ మ్యాచ్​లో కానిస్టేబుళ్లు ఎస్​ఐ, సీఐ, డీసీపీ స్థాయి పోలీసులతో పాటు నగర సీపీ రాజీవ్ కుమార్ మీనా ఉత్సాహంగా పాల్గొని క్రీడాస్ఫూర్తిని చాటారు.

వైజాగ్​లో పోలీసులు, జర్నలిస్టుల క్రికెట్​ మ్యాచ్
author img

By

Published : Nov 23, 2019, 4:59 PM IST

బ్యాట్​ పట్టిన పోలీసులు... బంతి విసిరిన జర్నలిస్టులు..!

పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు... విశాఖ నగర పోలీసులు, జర్నలిస్టులు క్రికెట్​ ఆడారు. మధురవాడలోని ఏసీఏ-వీడీసీఏ బి-గ్రౌండ్ మైదానంలో జరిగిన ఈ పోటీల్లో... పోలీసులు, జర్నలిస్టులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా పాల్గొని అందరిలో క్రీడా స్ఫూర్తిని నింపారు.

జర్నలిస్టులకు పోలీసులకు మధ్య సంబంధాలు మెరుగుపరిచే ఉద్దేశంతో... ఈ పోటీలు నిర్వహించినట్లు కమిషనర్ చెప్పారు. మొదట బ్యాటింగ్ చేసిన స్పోర్ట్స్ జర్నలిస్టుల టీం... 15 ఓవర్లలో 94 పరుగులు చేయగా... సిటీ పోలీస్ బృందం హోరాహోరీగా బ్యాటింగ్ చేసి... 94 పరుగులతో మ్యాచ్​ను డ్రా చేసింది. ఫలితంగా మళ్లీ సూపర్ ఓవర్ మ్యాచ్ ఆడారు. ఈ సూపర్ ఓవర్లో స్పోర్ట్స్ జర్నలిస్టులు విజయం సాధించారు. విజేతగా నిలిచిన స్పోర్ట్స్ జర్నలిస్టు టీంకు నగర పోలీస్ కమిషనర్ ట్రోఫీ అందజేశారు.

ఇదీ చదవండి

'అసెంబ్లీలో ఎలా వ్యవహరిస్తారో.. అది వంశీ ఇష్టమే'

Intro:విధి నిర్వహణలో అనునిత్యం బిజీగా ఉండే రక్షకభటులు జర్నలిస్టులు ఆటవిడుపు కోసం క్రీడాకారుల అవతారమెత్తారు నగర పోలీసులు స్పోర్ట్స్ జర్నలిస్టుల సంయుక్త ఆధ్వర్యంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు ఈ మ్యాచ్లో కానిస్టేబుళ్లు ఎస్ ఐ, సి ఐ, డి సి పి స్థాయి పోలీసులతో పాటు నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా ఆటల్లో ఉత్సాహంగా పాల్గొని క్రీడాస్ఫూర్తిని చాటారు

Body:పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు విశాఖ నగర పోలీసులు జర్నలిస్టులు ఇవాళ విశాఖలో క్రికెట్ క్రీడా పోటీలు నిర్వహించారు మధురవాడ లోని ఏసీఏ-వీడీసీఏ బి గ్రౌండ్ మైదానంలో జరిగిన ఈ పోటీలలో పోలీసులు జర్నలిస్టులు ఉత్సాహంగా పాల్గొన్నారు నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా ఈ పోటీల్లో పాల్గొని అందరిలో క్రీడా స్ఫూర్తిని నింపారు జర్నలిస్టులకు పోలీసులకు మధ్య అవినాభావ సంబంధం మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహించినట్లు కమిషనర్ చెప్పారు నేరగాళ్ల వేటలో పోలీసులు ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా వార్తలు సేకరించే జర్నలిస్టుల మానసిక ప్రశాంతతకు ఆటలు ఎంతో సహకరిస్తాయనీ కమిషనర్ ఆర్కె మీనా తెలిపారు ఈ పోటీల్లో మొదట బ్యాటింగ్ చేసిన స్పోర్ట్స్ జర్నలిస్టుల టీం 15 ఓవర్లలో 94 పరుగులు చేయగా దానిని అధిగమించాల్సి న సిటీ పోలీస్ టీం హోరాహోరీగా బ్యాటింగ్ చేసి 94 పరుగులతో మ్యాచ్ను డ్రా చేసింది దీంతో మళ్లీ సూపర్ ఓవర్ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది ఈ సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్కు దిగిన సిటీ పోలీస్ టీం ఆరు బంతులకు 16 పరుగులు చేయగా స్పోర్ట్స్ జర్నలిస్టులు దానిని అలవోకగా అధిగమించి విజయాన్ని అందుకున్నారు ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ టీంకు నగర పోలీస్ కమిషనర్ అభినందనలు తెలిపారు అనంతరం వారికి ట్రోఫీని అందజేశారు
---------
బైట్ ఆర్కే మీనా విశాఖ నగర పోలీస్ కమిషనర్
---------

Conclusion:ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో అన్ని విభాగాల అధికారులతో కూడా పోటీలు నిర్వహిస్తామని పోలీస్ కమిషనర్ వివరించారు (ఓవర్)

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.