రాష్ట్రంలో పెట్రోల్ బాదుడు సెంచరీల మోత మోగించింది. విశాఖ, కడప మినహా మిగతా అన్ని జిల్లాల్లో లీటరు పెట్రోలు ధర..వంద రూపాయలకు చేరింది. అనంతపురంలో లీటర్ పెట్రోల్ వంద రూపాయల 80 పైసలు, చిత్తూరు జిల్లాలో 101 రూపాయలు, తూర్పుగోదావరి జిల్లాలో వంద రూపాయల 23 పైసలు. పశ్చిమ గోదావరి జిల్లాలో నూటొక్క రూపాయల 23 పైసలకు పెరిగింది.
ఇక కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ వంద రూపాయల 70 పైసలు, గుంటూరు జిల్లాలో వంద రూపాయల 89 పైసలు, కర్నూలు జిల్లాలో నూటొక్క రూపాయల 3 పైసలు, నెల్లూరు జిల్లాలో వంద రూపాయల 30 పైసలు, శ్రీకాకుళం జిల్లాలో వంద రూపాయల 68 పైసలు, విజయనగరం జిల్లాలో వంద రూపాయల 4 పైసలకు పెరిగింది. ప్రకాశం జిల్లాలో వంద రూపాయల 67 పైసలకు చేరింది.
విజయవాడలో లీటర్ పెట్రోల్ వంద రూపాయల 89 పైసలుగా ఉంది. విశాఖ జిల్లాలో లీటర్ పెట్రోల్ 99 రూపాయల 90 పైసలు, కడప జిల్లాలో 99 రూపాయల 93పైసలుగా ఉంది. ఇవాళ విశాఖ జిల్లాలో లీటర్ పెట్రోలుపై 19 పైసలు, కడపలో 17 పైసలు తగ్గించడంతో.. ఆ రెండు జిల్లాల్లో మాత్రమే పెట్రోలు ధర వంద దిగువన ఉంది.
ఇదీ చదవండి:
Amul Pala Velluva: పశ్చిమగోదావరిలో 'అమూల్ పాల వెల్లువ' ప్రారంభం