ETV Bharat / city

విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజలు ఆగ్రహం.. ఆందోళనలకు సిద్ధం

Power Rates-Public Reactions: అసలే ఎండాకాలం..ఫ్యాన్, కూలర్ వేసుకుంటేనే ఉక్కపోత నుంచి విముక్తి దొరుకుతుందని చాలా మంది భావిస్తారు. కానీ ఇప్పుడు అవి వేసుకోవాలంటేనే ప్రజలు హడలెత్తుతున్నారు. కారణం విద్యుత్ ఛార్జీల పెంపు.. పేద, మధ్య తరగతి అనే తేడా లేకుండా అన్ని వర్గాలపై మోయలేని భారం మోపారంటూ ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికే చెత్తపన్ను, ఆస్తి పన్ను పెంచి.. మళ్లీ విద్యుత్ ఛార్జీలతో సామాన్యుల నడ్డి విరుస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు.

Power Rates-Public Reactions
విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజలు ఆగ్రహం
author img

By

Published : Mar 31, 2022, 8:15 AM IST

విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజలు ఆగ్రహం

Power Rates-Public Reactions: రాష్ట్రప్రజల నెత్తిన విద్యుత్ పిడుగు పడింది. నిత్యావసరాలు, పెట్రో ధరల మంటతో అల్లాడుతున్న ప్రజలకు విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విద్యుత్ కంపెనీలను నష్టాల నుంచి గట్టెక్కించి..మెరుగైన సేవలందించేందుకు వీలుగా కొత్త టారిఫ్ ఆర్డర్‌ను నిర్ధారించినట్టు..ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ప్రకటించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ కొత్త టారిఫ్ ఆర్డర్‌ను ఏపీఈఆర్‌సీ (A.P.E.R.C) ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి ప్రకటించారు. గతంలో ఉన్న 5 శ్లాబుల స్థానంలో ఆరింటిని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. పెరిగిన ఛార్జీలు ఏప్రిల్ నుంచే అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు.

విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇప్పటికే కరోనాతో రెండేళ్లు నష్టపోయామని ఇలాంటి పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు కోలుకోలేని దెబ్బతీస్తున్నారని మండిపడుతున్నారు. చెత్త, ఆస్తి పన్ను వేయడమే కాకుండా ప్రభుత్వం మరో భారం మోపిందని ఆక్షేపిస్తున్నారు. వేసవిలో కనీసం ఫ్యాన్స్ వేసుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు.

అప్రకటిత విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతుంటే... ఇప్పుడు మళ్లీ ఛార్జీలు పెంచి అవస్థలకు గురి చేస్తున్నారని సిక్కోలు వాసులు ధ్వజమెత్తారు. నిత్యవసరాల ధరలే కొనుక్కోని స్థితిలో..అధిక మొత్తంలో కరెంట్‌ బిల్లులు ఎలా చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు.

విద్యుత్ ఛార్జీల పెంపుపై తెలుగుదేశం తీవ్రంగా మండిపడింది. అన్న వచ్చాడు.. షాక్ ఇచ్చాడు... అంటూ తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. ఉగాది పండుగకు జగన్ ఛార్జీల మోతతో షాక్‌ ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో విద్యుత్ ఛార్జీలపై ప్రగల్భాలు పలికిన జగన్..ఇప్పుడు ఛార్జీలు పెంచడం అన్యాయమని MLA డోలా వీరాంజనేయస్వామి విమర్శించారు. జగన్ అసంబద్ధ నిర్ణయాలతో విద్యుత్తు సంస్థలు దివాలా తీసే పరిస్థితి ఏర్పడిందని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ఆక్షేపించారు.

ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా నేడు అన్ని జిల్లాల్లో నిరసనలకు వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. పెంచిన ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: ELECTRICITY CHARGES : రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ నుంచే అమల్లోకి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.