ETV Bharat / city

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. రూ. 2 లక్షల కోట్ల కుంభకోణం: శైలజానాథ్ - latest news in Sailajanath

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు తీసుకున్న నిర్ణయం... రెండు లక్షల కోట్ల రూపాయల స్కామ్​ అని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కుంభకోణంలో వైకాపా నేతల హస్తం ఉందని ఆరోపించారు.

Pcc President Sailajanath
పీసీసీ అధ్యక్షుడు శైలాజానాథ్
author img

By

Published : Feb 11, 2021, 9:32 PM IST

విశాఖ ఉక్కును ప్రైవేటుకు ధారాదత్తం చేయడం వెనుక రెండు లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని.. పీసీసీ అధ్యక్షుడు శైలాజనాథ్‌ ఆరోపించారు. ఈ కుంభకోణం​లో వైకాపా నేతల ప్రమేయం ఉందన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వానికి ముందే తెలుసని.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభలో చెప్పిన విషయాన్ని శైలజానాథ్ గుర్తు చేశారు.

కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు నిజమా... రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది వాస్తవమా అన్నది.. ముఖ్యమంత్రి జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. విలువైన భూములను విల్లాలుగా మార్చారని ఆరోపించారు. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న బంధాన్ని బయటపెట్టాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు కాంగ్రెస్ దీర్ఘకాలికంగా పోరాడనుందని శైలజానాథ్ వెల్లడించారు.

ఇదీ చదవండి:

మంత్రి వెల్లంపల్లికి షాక్.. సొంత నియోజకవర్గంలో నిరసన సెగ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.