ETV Bharat / city

PAWAN KALYAN: వారం రోజులు గడువిస్తున్నా.. అఖిలపక్షం ఏర్పాటు చేయాలి

author img

By

Published : Oct 31, 2021, 5:45 PM IST

Updated : Nov 1, 2021, 9:00 AM IST

విశాఖ ఉక్కు ఎవరి భిక్ష కాదు
విశాఖ ఉక్కు ఎవరి భిక్ష కాదు

16:31 October 31

ఉక్కు కార్మికులకు పవన్ సంఘీభావం

విశాఖ ఉక్కు ఎవరి భిక్ష కాదు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జనసేన తలపెట్టిన సభలో.. అధికార పార్టీ వైకాపాపై పవన్ నిప్పులు చెరిగారు. దేశ ప్రగతికి ఉక్కు కర్మాగారాలు చాలా ముఖ్యమన్న జనసేన అధినేత.. ఆంధ్రుల హక్కును ప్రైవేటు పరం చేస్తుంటే వైకాపా ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. టీ, కాఫీలు తాగడానికే పార్లమెంట్ కు వెళ్తున్నారా? అని నిలదీశారు. విశాఖ ఉక్కు కార్మగారం ఎవరి భిక్షవల్లో రాలేదని.. అది ఆత్మబలిదానాలతో సాధించుకున్న పరిశ్రమ అని పవన్ అన్నారు. 'విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు' నినాదంతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉక్కు ఉద్యమానికి ఆయన మద్దతు ప్రకటించారు. కూర్మన్నపాలెం గేటు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న పవన్.. కార్మికులకు సంఘీభావం తెలిపారు. అసెంబ్లీలో తీర్మానంతో చేతులు దులుపుకుంటే కుదరదని అన్నారు. 

శ్రీశ్రీ రాసిన ‘నేను సైతం’ కవితను చదివి ఉపన్యాసం ప్రారంభించిన పవన్.. నాయకుడు, కవి ఎప్పుడూ కార్మికలవైపే నిలబడలన్నారు. అలా చేయని జన్మ వృథా అని అన్నారు. ఎందరో పోరాటం చేస్తేనే విశాఖ ఉక్కు పరిశ్రమ ఇక్కడకు వచ్చిందని.. ఎవరి భిక్ష వల్లో కాదన్నారు. ఉక్కు ఉద్యమంలో ఆనాడు పోలీసు కాల్పుల్లో 32 మంది చనిపోయారని గుర్తు చేశారు. ఉక్కు పరిశ్రమ రావటంలో ఏయూ విద్యార్థుల పాత్ర కూడా ఉందన్నారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు నినాదం అందరిలో భావోద్వేగం నింపిందన్నారు.

నా వెనుక ఎవరూ లేరు..
ఉక్కు పరిశ్రమ నిర్వాసితులకు ఇప్పటికీ పరిహారం అందలేదని పవన్ అన్నారు. భూమి కోల్పోయిన నిర్వాసితులు అనేక కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ పరిశ్రమలు అభివృద్ధి చెందాలని తాను కోరుకుంటానన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించొద్దని గతంలోనే అమిత్‌షాను కలిసి కోరామన్నారు. తన వెనుక ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరూ లేరని.., తమకున్న ఒక్క ఎమ్మెల్యేనూ వైకాపా లాక్కెళ్లిందన్నారు. ఎవరూ లేకున్నా..ప్రజాబలం ఉందనే తనకు కేంద్రంలో ఎవరైనా అపాయింట్‌మెంట్ ఇస్తున్నారన్నారు. అన్నింటికీ ఉన్నట్లే విశాఖ ఉక్కు పరిశ్రమకూ నష్టాలు ఉన్నాయని.., ఒక్క వైకాపా రాజకీయ పరిశ్రమకు తప్ప అని పవన్ ఎద్దేవా చేశారు.

మన ఎంపీలు ఎందుకు అడగలేదు ?

కార్మికుల కష్టాలు కేంద్రంలోని పెద్దలకు ఎలా తెలుస్తాయని పవన్ అన్నారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు ఇవ్వాలని మనవాళ్లు ఎందుకు అడగటం లేదని నిలదీశారు. కేప్టివ్ మైన్స్ ఇవ్వాలని మన ఎంపీలు ఎందుకు అడగటంలేదని ప్రశ్నించారు. వైకాపా నేతలు కేంద్రానికి ఎందుకు మద్దతిస్తున్నారని పవన్ నిలదీశారు. కేంద్రం తెచ్చిన అనేక బిల్లులకు వైకాపా ఎంపీలు మద్దతిచ్చారని గుర్తు చేశారు. కేంద్రానికి మద్దతిచ్చే వేళ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు ఎందుకు అడగ లేదని ప్రశ్నించారు. సొంత గనులు ఉంటే ఉక్కు పరిశ్రమకు నష్టాలు తగ్గుతాయన్నారు. వైకాపా నేతలు.. పోరాటాలు చేసి వచ్చినవారు కాదన్నారు. వైకాపా నేతలకు ప్రజల కష్టాలు తెలియవన్నారు. వైకాపా నేతలకు తెలిసింది.. కాంట్రాక్టులు, పదవులు, సారా డబ్బులేనని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు కోసం వైకాపా నేతలు ఏం చేశారో చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. ఇలాంటప్పుడు 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు ఉండి ఏం ఉపయోగమని వైకాపాను ప్రశ్నించారు. 

కేంద్రాన్ని అడిగేముందు రాష్ట్ర పాలకులను బాధ్యులను చేయాలి. రాష్ట్ర విభజన వేళలోనూ ఎంపీలు మాట్లాడలేదని దిల్లీ పెద్దలు అంటారు. రాష్ట్ర విభజన సమయంలో విశాఖ ఉక్కుకు గనులు ఇవ్వాలని అడగలేదు. సొంత గనులు ఇవ్వాలని 22 మంది వైకాపా ఎంపీలు ఎందుకు అడగరు? పార్లమెంటుకు వెళ్లేది కబుర్లు చెప్పుకునేందుకు..కాఫీలు తాగేందుకా..!. విశాఖ ఉక్కు ఖర్చు పెట్టే రూ.100 కోట్లలో రూ.65 కోట్లు ముడిసరకుకే ఖర్చు అవుతుంది. ఎందరో ప్రాణత్యాగం చేస్తేనే విశాఖ ఉక్కు పరిశ్రమ వచ్చింది. 

స్టీల్ ప్లాంటుకు వ్యతిరేకంగా లేఖలిచ్చామని వైకాపా నేతలు అంటున్నారు. విభజన సమయంలో మీ లేఖల రాజకీయాలు మేం చూడలేదా ?. ఏమైనా అంటే భారతీయ జనతాపార్టీకి మా అవసరం లేదంటారు. మరి, అలాంటప్పుడు రాజ్యసభ ఛైర్మన్​ మీద అభాండాలు ఎందుకు వేశారు. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది. ఒకరిని సీజేఐ చేయకూడదని మీరు అప్పటి సీజేఐ బోబ్డే కు లేఖలు ఎలా రాశారు..? వ్యవస్థల్లో కీలకమైన వ్యక్తలతో గొడవ పెట్టుకునే ధైర్యం వైకాపాకు ఉందికానీ.. స్టీల్ ప్లాంట్​ ప్రైవేటీకరణను అడ్డుకునే ధైర్యం లేదు. ఎందుకంటే.. ప్రజలపై వైకాపాకు ప్రేమ లేదు.  -పవన్, జనసేన అధినేత

కొద్ది మంది కోసమే వచ్చా..
పెట్టుబడుల ఉపసంహరణ అనేది కొత్తగా వచ్చింది కాదని పవన్ అన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ 1992 నుంచే ప్రారంభమైందన్నారు. కార్మిక సంఘాల నేతల పోరాటం వల్లే అనేక పరిశ్రమలు మిగిలాయన్నారు. సమస్యలు వస్తే నిలబడతానని..తాను పారిపోయే వ్యక్తిని కాదన్నారు. తనకు ఓటేసిన కొద్దిమంది కోసమే విశాఖ వచ్చానన్నారు. స్టీల్‌ప్లాంట్ కార్మికుల తరఫున పోరాటం చేస్తానన్నారు. ఎన్నికల సమయంలో తన వెనుక ఎవరూ నిలబడలేదని..తాను మాత్రం ప్రజల పక్షాన నిలబడతానన్నారు.

వారంలోగా అఖిలపక్షాన్ని పిలవాలి..
స్టీల్‌ ప్లాంట్ రక్షణ కోసం వారంలోగా అఖిలపక్షాన్ని పిలవాలని  పవన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఎలా ఆపుతారో వైకాపా నేతలు చెప్పాలన్నారు. వైకాపా ప్రభుత్వం స్పందించకుంటే కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. మన పోరాటం మనం చేయకుండా.. కేంద్రాన్ని అనడం తనకిష్టం లేదన్నారు. చట్టసభల్లో తాను బలహీనుడినని..,ఒక్క ఎంపీ ఉన్నా..ప్రైవేటు బిల్లు పెట్చి చర్చకు తెచ్చేవాడినన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ బాధ్యత వైకాపా ప్రభుత్వానిదేనన్న పవన్...అన్ని పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజాసంఘాల నేతలతో మాట్లాడలన్నారు. మిగతా పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలను కలుపుకుని నడవాలన్నారు.  
 
ఇదీ చదవండి

"న్యాయస్థానం నుంచి దేవస్థానం" పాదయాత్రకు.. చురుగ్గా రైతుల ఏర్పాట్లు

Last Updated : Nov 1, 2021, 9:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.