Painter Murder:తల్లిని దూషించి, దుర్భాషలాడాడని ఆగ్రహం చెందిన ఓ యువకుడు.. అతడి ప్రాణాన్ని తీసేశాడు. నడిరోడ్డుపై పరిగెత్తించి మరీ హత్య చేసి రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకొచ్చి పడేసి వెళ్లిపోయాడు. ఈ దారుణ ఘటన విశాఖలోని అల్లిపురంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. 'అల్లిపురం ప్రాంతానికి చెందిన శ్రీను అనే వ్యక్తి పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. ఈరోజు ఉదయం అదే ప్రాంతానికి చెందిన గౌరీ అనే మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. నలుగురిలో అవమానపడిన ఆ మహిళ ఈ విషయాన్ని తన కొడుకు రాంప్రసాద్‌కు చెప్పింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు తన తల్లిని వెంటబెట్టుకుని పెయింటర్ శ్రీను వద్దకు వెళ్లాడు. అటువైపుగా వస్తున్న శ్రీను వీరిని చూసి పరుగులు పెట్టాడు. పరుగెడుతున్న శ్రీనును.. రాంప్రసాద్ వెంబడించి దాడి చేసి చంపేశాడు. అనంతరం ఈడ్చుకుంటూ రోడ్డుపై పడేసి వెళ్లిపోయాడు' అని వెల్లడించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులకు కాస్త పని సులువైంది. నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇవీ చదవండి: