రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో కార్తీక మాస ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న సన్నిధిలో కార్తీక మాసం ప్రత్యేక ఉత్సవాలు మొదలయ్యాయి. సింహగిరిపై వేంచేసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. కార్తీక మాసం నెల రోజులు క్షేత్ర పాలక శ్రీ త్రిపురాంతక స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. స్వామివారి గోశాలలో భక్తుల జాతక, నామ, నక్షత్ర దోష నివారణ కోసం ఏర్పాటు చేసిన నక్షత్ర వనాన్ని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి నేడు ప్రారంభించారు.
చాతుర్మాస దీక్ష అనంతరం తొలిసారిగా సింహాద్రి నాధుని దర్శనం చేసుకున్న స్వామీజీ గోశాలలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో సూర్యకళ స్వామీజీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నక్షత్ర వనం ప్రత్యేక పూజలను భక్తులందరూ ఉపయోగించుకోవాలని ఆలయ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి : IRCTC SPECIAL TOURIST TRAIN: 11 రోజులపాటు కాశీయాత్ర.. ఐఆర్సీటీసీ ప్రత్యేక రైలు