ETV Bharat / city

కేంద్రమంత్రి అశ్విని కుమార్ చౌబేకి స్వాత్మానందేంద్ర ఆశీస్సులు

కేంద్ర కేబినెట్​లో నూతనంగా చేరిన మంత్రి అశ్విని కుమార్ చౌబే విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా.. గిరిజనుల మనుగడను కాపాడేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని స్వాత్మానందేంద్ర మంత్రిని కోరారు.

swatmanandendra saraswathi
కేంద్రమంత్రికి స్వాత్మానందేంద్ర ఆశీస్సులు
author img

By

Published : Jul 13, 2021, 6:06 PM IST

మంత్రి అశ్విని కుమార్ చౌబే వివాసంలో స్వాత్మానందేంద్ర..
విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ సహాయమంత్రిగా నియమితులైన అశ్విని కుమార్ చౌబే నివాసాన్ని సందర్శించారు. మంత్రి ఆహ్వానం మేరకు నిన్న దిల్లీలోని మంత్రి నివాసానికి వెళ్లారు. చౌబే దంపతులు స్వామీజీ ఆశీస్సులు అందుకోగా.. వారిని స్వాత్మానందేంద్ర శాలువా కప్పి సత్కరించారు. ఆదిశంకరాచార్య ప్రతిమను బహుకరించి, రాజశ్యామల అమ్మవారి ప్రసాదాన్ని అందించారు.

ఆదివాసీల జీవనశైలి దెబ్బ తినకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కేంద్రమంత్రికి స్వాత్మానందేంద్ర విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రాంతాల్లో విశాఖ శారదాపీఠం చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామికి గిరిజనులంటే మక్కువ ఎక్కువని తెలిపారు. గోరక్షణ చర్యల్లో భాగంగా గిరిజనులకు గోవులను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ జాతుల మనుగడ కోల్పోకుండా ప్రత్యేక చట్టాలు రూపొందించాలని మంత్రికి స్వామీజీ సూచించారు.

ఇదీ చదవండి:

మూడు తలలతో జన్మించిన శిశువు

'తెలుగు భాషకు నష్టం కలిగిస్తే.. రాజకీయ భవిష్యత్ ఉండదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.