ETV Bharat / city

విశాఖలో జాతీయ స్థాయి ఎన్​సీసీ క్యాంప్​

author img

By

Published : Sep 30, 2022, 7:28 PM IST

NCC Camp: జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఎన్​సీసీ క్యాంప్​నకు విశాఖ ఆతిథ్యం ఇవ్వనుంది. దేశంలోని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్​సీసీ క్యాడెట్లు హాజరుకానున్నారు.

NCC
ఎన్​సీసీ

NCC Camp In Vishaka: అఖిల భారత నవ సైనిక్ ఎన్​సీసీ క్యాంప్​న​కు విశాఖ ఆతిథ్యం ఇవ్వనుంది. అక్టోబర్ 2 నుంచి 12 వరకు నేవల్ చిల్డ్రన్ స్కూల్​లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి నేవల్ ఎన్​సీసీ క్యాడెట్లు హాజరుకానున్నారు. ఎన్​సీసీ డైరెక్టరేట్​​​లు 17, సీనియర్ వింగ్ బాలికలు 204, సీనియర్ వింగ్ బాలురు 408 ఈ శిబిరానికి హాజరుకానున్నారు. ఈ క్యాంప్​లో పాల్గొన్న బాలబాలికలు తూర్పు నౌకాదళానికి చెందిన వివిధ నేవీ యూనిట్లను సందర్శించనున్నారు. అంతే కాకుండా వారికి ఫైరింగ్, బోట్ పుల్లింగ్, షిప్​ని పరిచయం చేయడం, డ్రిల్, వంటి వాటిల్లో శిక్షణను ఇస్తారు. ఈ క్యాంప్​ను ఏపీ తెలంగాణ ఎన్​సీసీ డిప్యూటీ డైరక్టర్ జనరల్ ఎయిర్ కమోడోర్ పీ మహేశ్వర్ ప్రారంభించనున్నారు. క్యాంపు కమాండర్​గా గ్రూప్ కమాండర్ కమోడోర్ అర్వింద్ నగర్ వ్యవహరిస్తారని నౌకాదళం వెల్లడించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.