జీవీఎంసీ ఎన్నికల్లో భాగంగా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన దృష్టికి స్థానికులు పలు సమస్యలను తీసుకువచ్చారు. మురికివాడల్లో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, సామాజిక భవనాల నిర్మాణం, అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు తదితర సౌకర్యాలను సంబంధిత వార్డులో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రచార కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎం వి వి సత్యనారాయణ, విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కెకె.రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పట్టపగలే న్యాయవాది దారుణ హత్య