ETV Bharat / state

బొబ్బిలి వీణ సంగీతం - ఆ మొక్కలు పెరిగితేనే స్వరం పలికేది! - BOBBILI VEENA MAKING PROBLEMS

బొబ్బిలి వీణల తయారీని వేధిస్తున్న పనస కలప కొరత

Bobbili Veena Making Problems
Bobbili Veena Making Problems (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 10, 2024, 11:07 AM IST

Bobbili Veena Making Problems : సప్తస్వరాలను సుమధురంగా పలికించే సంగీత సాధనాల్లో బొబ్బిలి వీణలది ప్రత్యేక స్థానం! విజయనగరం జిల్లా బొబ్బిలిలో తయారయ్యే ఈ వీణలు శ్రుతి తప్పకుండా వీనుల విందైన సంగీతం పలికిస్తాయనే గుర్తింపు ఉంది. అందుకే ఇక్కడ వీటి తయారీ 3 శతాబ్దాల క్రితమే మొదలై ఓ కుటీర పరిశ్రమగా కొనసాగుతోంది. బొబ్బిలి సమీపంలోని గొల్లపల్లి వడ్రంగులు వారసత్వంగా వీటిని తయారుచేస్తూ వస్తున్నారు.

సంగీతానికే కాదు గిఫ్ట్‌ వీణలకూ మంచి గిరాకీ ఉంది. నెమలి, హంస నమూనాలుండే వీణల్ని అతిథులు, ప్రముఖులకు జ్ఞాపికలుగా అందిస్తుంటారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ కూడా భారత పర్యటనలో బొబ్బిలి వీణను చూసి ముచ్చటపడ్డారు. తయారీదారుల సంఘం అధ్యక్షుడు సర్వసిద్ధి వెంకటరమణను వైట్‌హౌస్‌కు ఆహ్వానించి గౌరవించారు. ఏడేళ్ల క్రితం దీనికి భౌగోళిక గుర్తింపు కూడా దక్కింది.

సకాలంలో అందించలేని పరిస్థితి : బొబ్బిలి వీణకు చాలా ప్రత్యేకతలున్నాయి. మైసూరు, తంజావూరు వీణలు 3 చెక్కలతో తయారవుతాయి. కానీ బొబ్బిలి కళాకారులు మాత్రం ఒకే చెక్కతో చెక్కుతారు. దాని కోసం కేవలం పనస కలపనే వాడతారు. దీని వల్ల రాగం మృదువుగా ఉంటుంది. కానీ ఇప్పుడా పనస కలపకు కొరత ఏర్పడింది. ఫలితంగా ఆర్డర్లు సకాలంలో సరఫరా చేయలేకపోతున్నారు. స్థానికంగా అందుబాటులో లేక ఒడిశా నుంచి దిగుమతి చేసుకుంటుంటే తయారీ ఖర్చులు పెరిగి ఆ ప్రభావం వీణల విక్రయాలపై పడుతోంది.

"30 సంవత్సరాలు అయితే కానీ పనస చెట్లు మాకు అందుబాటులోకి రావు. గతంలో మా పెద్దలు వేసిన చెట్లే మాకు ఉపాధిని ఇస్తున్నాయి. ప్రభుత్వం పనస చెట్లు పెంచాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అంతవరకూ వుడ్‌ బ్యాంక్‌ కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అదే విధంగా మా కళాకారులకు ఆర్థికంగా చేయూతకు ఇవ్వాలని కోరుతున్నాం." - సర్వసిద్ధి రామకృష్ణ, వీణల కేంద్రం ఇంఛార్జ్‌, బొబ్బిలి

ఈ పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకం కింద ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా పనస చెట్లు పెంచాలని ఇటీవలే ఉప ముఖ్యమంత్రి పవన్‌ ఆదేశాలిచ్చారు. ఆ నిర్ణయాన్ని వీణ తయారీదారులు స్వాగతిస్తున్నారు. ఐతే పనస మొక్కలు కోతకు వచ్చేందుకు కనీసం 30 ఏళ్ల సమయం పడుతుంది. అప్పటి వరకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని, లేదంటే కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకమనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

బొబ్బిలి వీణకు ప్రభుత్వం ఆదరవు - ఇక సుస్వరాలు పదిలమే!

వీనుల విందుగా అఖండ కచ్ఛపీ మహోత్సవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.