ETV Bharat / state

ఒక్క జాగ్రత్త వంద రోగాలకు మెడిసిన్ - నోబెల్ గ్రహీత తేల్చిన రహస్యమిదే! - DR BARRY EXCLUSIVE INTERVIEW

నోబెల్‌ పురస్కార గ్రహీత ప్రొఫెసర్‌ బ్యారీ మార్షల్‌

DR_BARRY_EXCLUSIVE_INTERVIEW
DR_BARRY_EXCLUSIVE_INTERVIEW (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 10, 2024, 11:02 AM IST

Updated : Nov 10, 2024, 11:07 AM IST

Nobel Prize Winner DR Barry Marshall Exclusive Interview : మనం ఎదుర్కొనే అనేక వ్యాధులను అతి తేలికైన జాగ్రత్తలతో తగ్గించుకోవచ్చు. కేవలం చేతులను శుభ్రంగా ఉంచుకుంటే డయేరియా, కలరా, కామెర్లు, టైఫాయిడ్‌ తదితరాల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు. మనం తీసుకునే ఆహారం, తాగే నీరు శుద్ధిగా ఉంటే మన ఆరోగ్యమూ అంతే సురక్షితంగా ఉంటుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. శుభ్రతపై ఏమరుపాటుగా ఉంటే శరీరంపై జబ్బులు దాడి చేస్తాయి. ముఖ్యంగా ప్రమాదకరమైన హెలికోబ్యాక్టర్‌ పైలోరీ(HELICOBACTER PYLORI) బ్యాక్టీరియా మన శరీరంలో చేరిపోతుంది. తొలుత కడుపు ఉబ్బరం, పొట్టలో మంట, నోటి దుర్వాసన, గ్యాస్​ వంటి లక్షణాలతో సమస్య మొదలు అవుతుంది.

తర్వాత అల్సర్లను సృష్టించి బాధపెడుతూ క్యాన్సర్‌గా రూపాంతరం చెందుతుంది. దాదాపు 80 శాతం మందిలో దీని లక్షణాలేవీ కనిపించవు. 20 శాతం మందిలోనే తేలికపాటిగా కనిపిస్తాయి. వాంతులు, విరేచనాలు, రక్తం పడుతుందంటే మాత్రం సమస్య తీవ్ర రూపం దాల్చినట్లే. అయితే, దీనికి సమర్థమైన చికిత్స ఉందని అంటున్నారు నోబెల్‌ పురస్కార గ్రహీత, ఆస్ట్రేలియా వెస్ట్రన్‌ యూనివర్సిటీ క్లినికల్‌ మైక్రోబయాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బ్యారీ మార్షల్‌. హైదరాబాద్‌లోని ఏఐజీలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన ఈనాడు, ఈటీవీ భారత్​తో ముచ్చటించారు.

'ముందస్తు పరీక్షలతో క్యాన్సర్​ నియంత్రణ సాధ్యం- ఆహార అలవాట్లలో మార్పులు తప్పనిసరి' - Cancer Specialist Noori Dattatreya

తానే ప్రయోగశాలగా మారి ప్రాణాన్ని పణంగా పెట్టి! : హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియాను తొలిసారి బ్యారీ మార్షలే కనుగొన్నారు. పొట్టలో పూత(Peptic ulcer)కు హెచ్​ పైలోరీ బ్యాక్టీరియా కారణమని, దీర్ఘకాలంలో క్యాన్సర్‌కు దారి తీస్తుందని తేల్చారు. ఈ అంశంపై బ్యారీ మార్షల్​ డాక్టర్‌ రాబిన్‌ వారెన్‌తో కలిసి పరిశోధన చేశారు. అయితే ఆయన ఆవిష్కరణను ఎవ్వరూ నమ్మలేదు కదా పెద్దగా కూడా పట్టించుకోలేదు. ఈ సందర్భంలో శాస్త్రవేత్తలు ఎవరైనా మొదట జంతువులపై ప్రయోగాలు చేస్తారు. వాటి ఫలితాలతో అధ్యయన నివేదికలు రూపొందిస్తారు. కానీ, మార్షల్‌ మాత్రం తన శరీరాన్నే ఒక ప్రయోగశాలగా మార్చుకున్నారు. తానే స్వయంగా ఈ రకం బ్యాక్టీరియాను తీసుకున్నారు. 5 రోజుల తర్వాత వ్యాధి బారిన పడ్డారు. వాంతులు, వికారం, నోటి దుర్వాసన వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. దాంతో బయాప్సీ చేస్తే తన జీర్ణాశయంలో హెచ్‌ పైలోరీ (H Pylori) అనే రకం బ్యాక్టీరియా ఉన్నట్లుగా తేలింది. ఇందుకు ఆయన చికిత్స పొంది తిరిగి కోలుకున్నారు. ఈ ఆవిష్కరణకే ప్రొఫెసర్‌ బ్యారీ మార్షల్‌కు 2005లో వైద్య శాస్త్రంలో నోబెల్‌ బహుమతి వరించింది.

‘హెచ్‌ పైలోరీ’ చికిత్సలో ఏమైనా పురోగతి సాధించామా భారత్‌పై దీని ప్రభావం ఎలా ఉంది? : జీర్ణాశయంలో అల్సర్లకు ఆమ్లాలు కారణమని మొదట్లో భావించేవారు. తర్వాత హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా కారణమని తేలింది. ఈ రకం బ్యాక్టీరియా మన జీర్ణాశయం అంతర్గత గోడల ఉపరితలంలో ఉండే జిగురు పొరలను అతుక్కుని ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఉనికిని శ్వాస, మల, రక్త పరీక్షలు (Blood Test), ఎండోస్కోపీ పరీక్షల ద్వారా నిర్ధారించవచ్చు. రెండు వారాల పాటు యాంటీ బయాటిక్స్‌తో చికిత్స అందిస్తే సరిపోతుంది. చికిత్స తర్వాత పూర్తిగా నయమైందా? లేదా? అని తెలుసుకోవడానికి మళ్లీ పరీక్ష చేయించుకోవాల్సిందే!

భారత్, చైనా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలతో పాటు ఆఫ్రికా, యూరప్‌ ఖండాల్లోనూ ఎక్కువ మంది ఈ రకం బ్యాక్టీరియాతో బాధపడుతున్నారు. భారత్‌లో డయాబెటిక్​ పేషెంట్స్​ సంఖ్య కంటే పదింతలు అధికంగా బాధితులు ఉంటారని నిపుణుల అంచనా. ఈ వ్యాధికి సంబంధించి స్వల్ప లక్షణాలు ఉన్నప్పుడు యోగర్ట్‌ లేదా పెరుగు (Yogurt or Curd) వంటి ప్రోబయాటిక్స్‌ వాడితే కొంత వరకు ఉపశమనంగా ఉంటుంది. వ్యాధి పూర్తిగా నయం అవ్వాలంటే మాత్రం యాంటీబయాటిక్స్‌ వాడాల్సిందే.

'సంకల్పం'తో మాదకద్రవ్యాల వ్యాప్తికి చెక్ - కళాశాలల్లో వినూత్నంగా అవగాహన కల్పిస్తున్న పోలీసులు - POLICE SANKALPAM PROGRAM ON DRUGS

ఒకరి నుంచి ఒకరికి ఎలా సోకుతుంది? నోట్లోని లాలాజలం ద్వారా ఈ బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. సాధారణంగా ఒక కుటుంబంలో ఒకరికి హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా ఉంటే అందరికీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లి నుంచి చిన్నారులకు, ఇతర కుటుంబ సభ్యులకు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ ఉంది. తల్లి పొట్టలో ఉన్న హెచ్‌ పైలోరీ (H Pylori) బ్యాక్టీరియా ఆమె నోట్లోని లాలాజలంలోకి (Saliva) చేరుతుంది. ఆమె తన చేతులను నోటి దగ్గర తుడుచుకొని అవే చేతులతో పిల్లలను తాకినప్పుడు వారికి హెచ్​ పైలోరీ బ్యాక్టీరియా చేరుతుంది. ఆమె చేతుల్లోని ఆహారం ద్వారా కూడా తమ పిల్లలకు చేరుతుంది.

ఇది కొందరిలోనే ప్రమాదకరంగా మారడానికి ప్రత్యేక కారణాలేమైనా ఉన్నాయా? హెచ్‌ పైలోరీ అందరిలోనూ తీవ్ర ప్రభావం చూపించదు. ఈ అంశంపై ఇక పరిశోధనలు జరుగుతున్నాయి. జనాభాలోని 20% మందిలోనే అల్సర్లు ఏర్పడే అవకాశం ఉంది. ఈ బ్యాక్టీరియా జీర్ణాశయంలోని పై పొర ఉపరితలంపై ఉండి, అక్కడి జిగురు వ్యవస్థను దెబ్బ తీస్తుంది. జబ్బు తీవ్రమయ్యే వరకు గుర్తించలేకపోతే అందుకు చికిత్స కూడా కష్టమవుతుంది.

హెచ్‌ పైలోరీ శరీరంలోకి ప్రవేశించిన 10, 15 ఏళ్ల తర్వాత పొట్టలో ఆమ్లాల శాతం గణనీయంగా తగ్గిపోతుంది. ఇలాంటి వారిలోనే 1% మంది క్యాన్సర్‌ బారినపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారతదేశంలోని 140 కోట్ల జనాభాలో 20 శాతం మందికి అల్సర్లు, 1 శాతం మందికి క్యాన్సర్లు వస్తే అది పెద్ద సంఖ్యే.

చిన్నారుల్లో ఈ బ్యాక్టీరియా లక్షణాలను గుర్తించవచ్చా? చిన్నపిల్లల్లో ఇలాంటి లక్షణాలు పెద్దగా కనిపించవు. వారికి చికిత్స అందించడం కూడా కష్టమే. ఎందుకంటే చిన్నారులకు పెద్దల మాదిరిగా యాంటీ బయాటిక్స్‌ను ఇవ్వలేం. ఒకవేళ ఇస్తే వారిలో యాంటీ బయాటిక్స్‌ నిరోధకత పెరిగే ప్రమాదం ఉంది. ఇంట్లో శుభ్రతను పాటించడం ద్వారా చిన్నపిల్లలకు ఈ బ్యాక్టీరియా సోకకుండా జాగ్రత్తపడాలి. అయితే యాంటీ బయాటిక్స్‌ విచ్చలవిడి వాడకంతో అవసరం ఉన్నప్పుడు అవి పనిచేయడం లేదు. అందుకే వీటి వాడకంపై నియంత్రణ అవసరం.

బీమా ఉంటే జీవితానికి ధీమా- కుటుంబానికి ఆర్థిక భద్రత - Why All Need Insurance

ఈ బ్యాక్టీరియా బాధితులు ఎక్కువగా ఎక్కడ ఉంటారు? నగరాలతో పోలిస్తే గ్రామాల్లో హెచ్‌ పైలోరీ బాధితులు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ కూడా ప్రధానంగా పరిశుభ్రత పాటించకపోవడమే కారణం. స్వచ్ఛమైన తాగునీరు లభించకపోవడంతో ఈ బ్యాక్టీరియా వ్యాప్తి అధికం అవుతోంది. వ్యక్తి గత పరిశుభ్రతా లోపిస్తోంది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు శుద్ధిచేసిన తాగు నీటిని అందించడం వల్ల హెచ్‌ పైలోరీ కేసుల సంఖ్య కొంత తగ్గుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రజల్లో వ్యక్తిగత, తాగునీరు, ఆహార పరిశుభ్రతపై అవగాహన పెంపొందిస్తే ఈ వ్యాధిని అరికట్టవచ్చు. భారతదేశం జనాభాలోని దాదాపు సగం మందిలో ఈ బ్యాక్టీరియా నిక్షిప్తమై ఉంది. దీనికి చికిత్స కొనసాగిస్తే వచ్చే 10-20 ఏళ్లలో ఈ బ్యాక్టీరియా బాధితుల సంఖ్య 50% నుంచి 20%నికి తగ్గుతుంది.

ఇన్ని కోట్ల జనాభాలో ఎవరు పరీక్షలు చేయించుకోవాలి? ఇన్ని కోట్ల జనాభాలో అందరూ పరీక్షలు చేయించుకోవడం చాలా కష్టం. ప్రభుత్వం కూడా పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు. అయితే స్వల్ప లక్షణాలు కనిపించిన వారు హెచ్‌ పైలోరీ (H Pylori) బ్యాక్టీరియాకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. కుటుంబంలో జీర్ణ కోశ క్యాన్సర్లు, అల్సర్ల ఉన్నవారు ఈ పరీక్షలు చేయించుకుంటే మంచిది. మంచి ఆహారం, శుద్ధమైన తాగునీరు, చేతుల శుభ్రత ద్వారా ఈ బ్యాక్టీరియా బారిన పడకుండా జాగ్రత్తపడొచ్చు.

భవిష్యత్‌లో హెచ్‌ పైలోరీకి టీకా వచ్చే అవకాశాలున్నాయా? హెచ్ పైలోరీకిటీకాను కనుగొనే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ టీకా ద్వారా అంతగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ రకం బ్యాక్టీరియా ఒక్కో వ్యక్తి శరీరంలో ఒక్కోలా స్పందించడం వల్ల టీకాను కనుగొనడం కష్టం. అలాంటప్పుడు అందరికీ ఒకే విధంగా తయారుచేసే టీకా ఎలా పనిచేస్తుంది? అయినా ఈ టీకాపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. నేనూ వాటిలో పాలుపంచుకుంటున్నా. క్లినికల్‌ సమాచారాన్ని క్రోడీకరించడం, పరిష్కారం కనుగొనడంలో కృత్రిమమేధను (AI) కూడా వినియోగిస్తున్నాం.

ఈ బ్యాక్టీరియా ఒంట్లో ఉన్నట్లు ఎలా గుర్తించాలి? లక్షణాలు ప్రత్యేకంగా ఇవీ అని చెప్పలేకుండా ఉంటాయి. మనలో చాలా మంది ఏదైనా తిన్న వెంటనే కడుపులో ఒక రకమైన ఇబ్బంది, నొప్పి, మంట, గ్యాస్, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలతో బాధపడతారు. వీరిలో 1 శాతం మందిలో మాత్రమే తీవ్ర కడుపు నొప్పి, వాంతులు, రక్తంపడడం, బరువు కోల్పోవడం వంటివి ఉంటాయి. ఇలా తరచూ బాధ పడుతున్నారంటే పొట్టలో ఏదో సమస్య ఉన్నట్లే గుర్తించి పరీక్ష చేయించుకోవాలి.

'మరణాంతరం చూడగలిగే ఏకైక అవకాశం నేత్రదానమే'- ప్రజల్లో అవగాహనకు ఎల్​వీ ప్రసాద్ వైద్యుల కృషి - Eye Donation Awareness Program

కొంత మంది కారం తిన్నా, పిజ్జా తిన్నా పడడం లేదని, కడుపులో మంటగా ఉందని అంటారు. కానీ ఆ సమస్య కారం, పిజ్జాలతో కాదు. జీర్ణాశయంలో చేరిన బ్యాక్టీరియా వల్ల అప్పటికే ఇన్‌ఫ్లమేషన్‌ (Inflammation) ఉన్నప్పుడు దాని మీద కారం పడితే మంటగా అనిపిస్తుంది. అందుకే దీర్ఘకాలిక ఇన్‌ఫెక్షన్, ఇన్‌ఫ్లమేషన్‌లకు సంబంధించిన పరీక్షలను చేయించుకోవాలి. మల విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోకున్నా ప్రమాదమే. అలాంటి వారి చేతుల నుంచి బ్యాక్టీరియా తాగు నీటిలోకి చేరే అవకాశం ఉంది.

Last Updated : Nov 10, 2024, 11:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.