విశాఖ మన్యం అంతటా... పచ్చని కొండలు, అటవీ భూములతో సుందరంగా కనిపిస్తాయి. అయితే ఆ కొండల మధ్య నివసించే ప్రజలు... అతి సాధారణమైన సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. ఈ రోజుల్లో కూడు, గూడు, గుడ్డతో సమానంగా అత్యవసరంగా మారిన సెల్‌ఫోన్‌ను వారి అవసరాలకు తగ్గట్టుగా వినియోగించుకోలేకపోతున్నారు. అరకు, పాడేరు మినహా మిగతా మన్యం ప్రాంతాల్లో సిగ్నల్ లేమి వారిని వేధిస్తోంది. సిగ్నల్ కోసం కిలోమీటర్ల మేర నడిచి... చెట్లు ఎక్కి సాహసమే చేస్తున్నారు.
ఉద్యోగులు, విద్యార్థులు... రోజువారీ పనులు ముగించుకుని ఇంటికి వచ్చాక... బయట ప్రపంచంతో సంబంధం లేకుండా పోతోందంటున్నారు. కొన్నిచోట్ల చెట్ల పైకెక్కితే సిగ్నల్స్ అంతంతమాత్రంగా వస్తుండటంతో... ఆయా ప్రాంతాలకు ప్రజలు తరలివెళ్తున్నారు.
ఉద్యోగ ప్రకటనలు, ఇంటర్వ్యూల వివరాలు సమయానికి తెలుసుకోలేక అవస్థలు పడుతున్నామని ఈ ప్రాంత విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైన మేరకు మన్యంలో టవర్లు ఏర్పాటు చేసి సిగ్నల్ సమస్య తీర్చాలని గిరిజనులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి: