ETV Bharat / city

విశాఖను 'మురికివాడల రహిత నగరం'గా తీర్చిదిద్దుతాం: మంత్రి ముత్తంశెట్టి

విశాఖలోని ప్రభుత్వ భూములను ఎవరు ఆక్రమించినా ఉపేక్షించేది లేదని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖను మురికివాడల రహిత నగరంగా తీర్చిదిద్దుతామన్నారు.

Muttamsetti
మంత్రి ముత్తంశెట్టి
author img

By

Published : Jun 29, 2021, 4:31 PM IST

విశాఖ అభివృద్ధి మీద కలెక్టరేట్​లో చర్చ జరిగింది. విశాఖను మురికివాడల రహిత నగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఆగస్టు మొదటి వారంలో సీఎం చేతులు మీదుగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు. ఒక్క రోజులో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. జాతీయ రహదారికి భోగాపురాన్ని అనుసంధానం చేస్తూ.. విశాఖ బీచ్ - భీమిలి మీదుగా రోడ్డును నిర్మిస్తామని తెలిపారు. విశాఖ భూములను ఎవరు ఆక్రమించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.. ప్రభుత్వ భూమిని, ప్రజల భూమిని కాపాడే బాధ్యత అందరిదని చెప్పారు. త్వరలో సింహాచల భూ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. విశాఖ, విజయనగరం ఇరు జిల్లాల కలెక్టర్​లు మాన్సస్ భూములపై సర్వే చేసి నివేదిక ఇచ్చారని.. పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నట్లు మంత్రి వివరించారు.

మాన్సస్ భూములపై విచారణ జరుగుతోంది: విజయసాయిరెడ్డి

విశాఖలో కొన్ని వేలకోట్ల ఆస్తులు అన్యాక్రాంతం అయ్యాయని, వాటిపై విచారణ జరుగుతోందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. దేవాదాయ శాఖ నిబంధనలు ప్రకారం, కోర్టు ఆదేశాలు బట్టి ముందుకు వెళతామని స్పష్టం చేశారు. ఎస్టేట్ ఎబాలిష్ యాక్ట్ వచ్చినప్పటి నుంచి సింహాచలం, మాన్సస్ భూముల్లో జరిగిన అవకతవకలు అన్నింటిపైన దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.

ఇదీ చదవండి: కొవిడ్ బాధితుల కోసం తెలుగుదేశం ఆందోళన బాట.. చంద్రబాబు ఆధ్వర్యంలో సాధన దీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.