'వైకాపాలోకి ద్వారాలు మూసుకుపోయాయి.. అందువల్ల అక్కడే ఉన్నారు' - మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు తాజా
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు పరోక్షంగా విమర్శలు చేశారు. ఆరు నెలలు నుంచి మాట్లాడని వారు ఇప్పుడు ప్రసార మాధ్యమాల ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. వైకాపాలోకి వచ్చేందుకు ద్వారాలు మూసుకుపోవడం వల్ల ఎటు వెళ్లాలో తెలియక అక్కడే ఉండి పోయారని ఎద్దేవా చేశారు. కొందరు అధికారం కోసం పనిచేస్తారని... తాను మాత్రం ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు.
'ద్వారాలు మూసుకుపోవటంతో... అక్కడే ఉన్నారు'