విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో సహాయచర్యల పై మంత్రి అవంతి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులు, పీసీపీ అధికారులు పాల్గొన్నారు. ప్రమాద స్థలం వద్ద ఆపరేషన్ ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. పరిశ్రమ నుంచి గ్యాస్ లీకేజ్ పూర్తిగా నిలిచిపోయిందని మంత్రి అవంతి తెలిపారు. వేపర్ మాత్రం కొన్ని చోట్ల హెచ్చు తగ్గులు ఉందన్నారు. ముందు జాగ్రత్తగా కొంతమందిని ఖాళీ చేయించామని మంత్రి పేర్కొన్నారు.
ఇవీ చదవండి...గాలి స్వచ్ఛత తెలుసుకునేందుకు ప్రత్యేక యంత్రం