విశాఖలోని మధురవాడ టైలర్స్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. మధురవాడ టైలర్స్ కాలనీకి చెందిన మురళీ (18) ప్రమాదవశాత్తు ప్రొక్లెయినర్ కిందపడి మృతి చెందాడు. ప్రొక్లెయినర్ హెల్పర్‌గా పని చేస్తున్న మురళీ.. తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్నాడు. ఇవాళ ఉదయం మధురవాడ న్యాయ కళాశాల సమీపంలో ఎంవీవీ విల్లాస్ వద్ద రోడ్డు విస్తరణ పని జరుగుతోంది. తెల్లవారుజామున ప్రొక్లెయినర్ డ్రైవర్ బండిని స్టార్ట్ చేయగా.. అక్కడేవున్న మురళీ దానిని గమనించలేదు. ప్రమాదవశాత్తు ప్రొక్లెయినర్ చైన్‌లో మురళీ ఇరుక్కుని చనిపోయాడు. కుమారుడు మృతి సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు మృతదేహం వద్ద బోరున విలపించారు.
ఇదీ చదవండి: