వైభవంగా సింహాద్రి అప్పన్న(simhadri appanna) ఆఖరి విడత చందనోత్సవాన్ని కార్యక్రమం ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. మూడు మణుగుల నూట ఇరవై ఐదు కేజీల చందనాన్ని స్వామి వారికి ఆషాడ పౌర్ణమి నాడు సమర్పించనున్నారు.
దీంతో అప్పన్న స్వామి పూర్తి చందన స్వామిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
నేడు స్వామివారి కల్యాణం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ దంపతులు స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామి దర్శనం చేయించారు.
ఇదీ చదవండి: కేంద్రమంత్రి అశ్విని కుమార్ చౌబేకి స్వాత్మానందేంద్ర ఆశీస్సులు