ETV Bharat / city

జనసేన ర్యాలీలో పాల్గొనలేము​: వామపక్షాలు

విశాఖలో జనసేన తలపెట్టిన లాంగ్​మార్చ్​కు వామపక్షాల మద్దతు ప్రకటించాయి. కానీ ప్రత్యక్షంగా ర్యాలీ పాల్గొనలేమని ఓ ప్రకటనలో ఆ పార్టీల నేతలు స్పష్టం చేశారు. తమను ఆహ్వానించినందుకు పవన్​కు ధన్యవాదాలు తెలిపారు. భాజపా సహకారం తీసుకోవడానికి జనసేనకు అభ్యంతరం లేకపోవడం... తమకు ఆమోదయోగ్యం కాదని లేఖ రాశారు.

జనసేన ర్యాలీలో పాల్గొలేమ్​ : వామపక్షాలు
author img

By

Published : Nov 2, 2019, 4:42 PM IST

జనసేన ర్యాలీలో పాల్గొనలేము​: వామపక్షాలు

భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో రేపు... జనసేన తలపెట్టిన లాంగ్‌మార్చ్‌కు వామపక్ష పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. ప్రత్యక్షంగా పాల్గొనబోమని చెప్పాయి. ఇసుక సమస్యపై నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి సీపీఐ, సీపీఎంలను ఆహ్వానించినందుకు... ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, మధు ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు పవన్‌కల్యాణ్‌కు లేఖ రాశారు. జనసేన నిరసనకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

ఈ నిరసన కార్యక్రమానికి భాజపా సహకారం తీసుకోవడానికి... జనసేన పార్టీకి అభ్యంతరం లేదనే విషయాన్ని తాము అర్థం చేసుకున్నామని... ఈ వైఖరి తమకు ఆమోదయోగ్యం కాదని ఆ లేఖలో వామపక్ష నేతలు పేర్కొన్నారు. అందువల్ల జనసేన ర్యాలీకి హాజరుకాలేకపోతున్నామని స్పష్టం చేశారు. కాగా తాను తలపెట్టిన ర్యాలీకి రావాల్సిందిగా... పవన్​కల్యాణ్ అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు నేరుగా ఫోన్‌ చేశారు.

ఇదీ చదవండి :

జనసేన విశాఖ ర్యాలీకి తెదేపా మద్దతు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.