ETV Bharat / city

నిత్యావసరాలు కావాలంటే మైళ్ల దూరం ఈదాల్సిదే

author img

By

Published : Aug 21, 2020, 7:08 PM IST

మారుతున్న కాలం...అభివృద్ధిబాటలో పరుగెడుతున్న సమాజం...కానీ తమ బతుకులు మాత్రం మారడం లేదంటున్నారు గిరిజనులు. అగ్గిపెట్టె నుంచి ఆహార పదార్ధాల వరకూ ఏవి కొనాలన్నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కిలోమీటర్ల దూరం ఈత కొట్టుకుంటూ పోవాలి...తినకుంటే ప్రాణాలు పోతాయి..తెచ్చుకోవటానికి పోతే తిరిగి వస్తారో లేదో తెలియని పరిస్థితి..ఈ గిరిపుత్రుల కష్టాలపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం...

Kilometers away the tribesmen go swimming and fetch daily necessities in visakha agency

ఆ ప్రాంతంలో నిత్యావసర సరకులు తెచ్చుకువాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాలి...కిలోమీటర్ల దూరం ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు వచ్చి సరకులు తీసుకోవాల్సిన పరిస్థితి...వర్షాకాలంలో ఇది మరింత కష్టంగా మారుతుంది.. చిన్న వంతెన నిర్మిస్తే తమ బతుకులు మారుతాయని ఆ గిరిజనలు అంటున్నారు..

విశాఖ ఏజెన్సీ సముద్రమట్టానికి 3500 అడుగుల ఎత్తులో ఉంటుంది. పాడేరు మన్యంలో ముఖ్యంగా పెదబయలు ముంచింగిపుట్టు జి.మాడుగుల మండలాల్లో శివారు గ్రామాలకు వెళ్లాలంటే గెడ్డలు ఈదుకుంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకోని పోవాలి.

అగ్గి పెట్టి తెచ్చుకోవాలన్నా ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకోవాలి. ఇక్కడ గిరిజనులకు కావాల్సింది చిన్న వంతెన మాత్రమే. కోడి మామిడి గెడ్డ అవతల ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల గిరి పల్లెలు ఉన్నాయి. ఆంధ్రాలో జి.మాడుగుల, పెదబయలు మండలాలకు చెందిన గ్రామాల గిరిజనులు ఇవే ఇబ్బందులు కలిగి ఉన్నారు. నిత్యావసరాలు తెచ్చుకునేందుకు వారానికోసారి సమీపంలో మద్దిగరువు సంతకు వస్తారు.

ఈ గడ్డలకు రావడానికి 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం 4-5 గంటల పాటు కాలినడకన వచ్చి ఈదుతూ నిత్యవసరాల కోసం వారు పడుతున్న బాధ వర్ణనాతీతం. కావలసిన సామగ్రి కొనుగోలు చేసుకుని ప్లాస్టిక్ కవర్లో వేసుకుంటారు. పెద్ద మూట కట్టి ప్రవాహంలో వదిలేస్తారు.. వారు వంటికి డిప్పలు కట్టుకుని నదిలో ఈదుతూ మరో చేతితో మూటను తోస్తూ అవతలి ఒడ్డుకు చేరుకుంటారు.

ప్రభుత్వాలు మారినా మా కష్టాలు తొలగించే నాథుడే లేడంటూ నిట్టూరుస్తున్నారు గిరిజనులు. మహిళలు సైతం మగవారిని పట్టుకుని ఈదుకుంటూ ఒడ్డుకు చేరుతారు. అధికారులు స్పందించి వంతెన నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు..

మైళ్లదూరం ఈతకొట్టి నిత్యవసరాలు తెచ్చుకుంటున్న గిరిజనులు

ఇదీ చూడండి

కొవిడ్ బాధితులకు ఏ ఇబ్బంది రావొద్దు: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.