ETV Bharat / city

KIDNAP CASE: ఆరేళ్ల క్రితం బాలిక అదృశ్యం..ఇంటికి చేర్చిన పోలీసులు..ఇన్నాళ్లు ఏమైంది? - క్రైమ్ వార్తలు

విశాఖ జిల్లాలో ఆరేళ్ల క్రితం అదృశ్యమైన ఓ బాలిక కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. రాజస్థాన్​లో గుర్తించిన బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. కేసులో నిందితుడైన ఉపాధ్యాయుడిని రిమాండ్​కు తరలించారు.

KIDNAP CASE CHASED
KIDNAP CASE CHASED
author img

By

Published : Oct 5, 2021, 10:06 PM IST

ఆరేళ్ల క్రితం అదృశ్యమైన బాలిక కేసులు చేధించిన పోలీసులు

ఆరేళ్ల క్రితం నాటి కిడ్నాప్ కేసును అనకాపల్లి - చోడవరం పోలీసు బృందాలు ఛేదించాయి. తన కుమార్తె కనిపించడం లేదంటూ.. అమె తండ్రి 2015లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి.. తర్వాత దానిని కిడ్నాప్ కేసుగా మార్చారు. ఈ విషయంలో కొయ్యాన తిరుపతిరావు అనే ఉపాధ్యాయుడిపై అనుమానం ఉందని కేసు నమోదు చేశారు. అప్పట్లో బాలిక తల్లిదండ్రులు ముఖ్యమంత్రి, డీజీపీలను కలిసి తమ కుమార్తె మిస్సింగ్ కేసు గురించి వివరించి.. అనుమానితుల వివరాలను అందించారు.

సదరు బాలికను పట్టుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఎట్టకేలకు ఇప్పుడు ఫలించింది. ఆమెతో ఉన్న తిరుపతిరావును రాజస్థాన్​లోని అళ్వార్ జిల్లాలో పట్టుకుని ఆరెస్ట్ చేసిన పోలీసులు.. వారిని విశాఖ జిల్లాకు తీసుకొచ్చారు. వారికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆరేళ్ల తర్వాత సదరు బాలికను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ట్రాన్సిట్ వారెంట్ మీద తీసుకొచ్చిన నిందితుడిని రిమాండ్​కి పంపారు. అప్పుడు 13 ఏళ్లు ఉన్న బాలిక మైనర్ అని.. ఇప్పుడు 19 ఏళ్ల యువతి అని పోలీసులు వివరించారు. ప్రత్యేక బృందాలు పెండింగ్​లో ఉన్న కేసులను ఛేదించేందుకు ఏర్పాటు చేయడం వల్ల ఆరేళ్ల క్రితం నాటి కేసులో నిందితుడు పట్టుబడ్డాడని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి వెల్లడించారు.

''2015లో అదృశ్యమైన బాలికను రాజస్థాన్​లోని అళ్వార్ జిల్లాలో గుర్తించాం. ఉపాధ్యాయుడైన నిందితుడు తిరుపతిరావును ట్రాన్సిట్ వారెంట్ మీద విశాఖ జిల్లాకు తీసుకొచ్చాం. నిందితుడిని డిజిటల్ గుర్తింపు ఆధారంగా పట్టుకున్నాం. బాలికను తల్లిదండ్రులకు అప్పగించాం. నిందితుడు చాకచక్యంగా వ్యవహరించడం వల్ల ఇన్నాళ్లూ ఆధారాలు దొరకలేదు. ప్రత్యేక టీం కృషితో ఎట్టకేలకు కేసును చేధించాం.'' - శ్రావణి, అనకాపల్లి డీఎస్పీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.