తెలుగుదేశానికి జనసేన 'బీ' టీమ్ అంటూ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి మొదలు.. ఆపార్టీ నేతలు పదేపదే చేస్తున్న విమర్శలను పవన్ కల్యాణ్ తిప్పికొట్టారు. మంత్రులు బొత్స, కన్నబాబు వంటి నేతల చరిత్ర తనకు తెలుసనని.. వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డిని ఫ్రై డే మ్యాన్‌గా అభివర్ణించిన పవన్... ఎన్నికల్లో ఓడినంతమాత్రాన భయపడే వ్యక్తిని కాదని స్పష్టంచేశారు. దెబ్బతిన్నా మళ్లీ పైకి లేవడమే తన నైజమని తెగేసి చెప్పారు. దిల్లీ పెద్దలకు రాష్ట్రంలోని పరిస్థితుల్ని వివరిస్తానని.. ప్రకటించారు.
ఇవాళ, రేపు విశాఖలోనే ఉండనున్న పవన్ ఎన్నికల అనంతర పరిణామాలపై ఉత్తరాంధ్ర నాయకులతో సమీక్షిస్తారు.
ఇదీ చదవండి: 'రెండు వారాలే గడువు... స్పందించకపోతే అమరావతిలో నడుస్తా'