ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలను కూడా చేపట్టాలని రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గురువారం విశాఖలో వనమహోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొక్కలను నాటారు.
జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ పాల్గొన్నారు. మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు మాట్లాడారు. సీఎం జగన్.. వాతావరణ సమతుల్యత పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా భావిస్తూ విరివిగా మొక్కలు నాటే బృహత్తర లక్ష్యంతో "జగనన్న పచ్చతోరణం " కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.
ఇదీ చదవండి: