విశాఖలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అక్రమాలపై అధికారులు చర్యలు చేపట్టారు. నకిలీ రసీదులతో నగదు మళ్లించిన వ్యవహారంలో నలుగురిపై వేటు పడింది. మర్రిపాలెం ఎక్సైజ్ సీఐ నాగశ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ కొండయ్య, కానిస్టేబుళ్లు జయరామ్, రామానాయుడులను సస్పెండ్ చేశారు. ఎస్‌ఐ విమలాదేవిపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ కమిషనర్‌కు సిఫార్సు చేశారు. సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ కమిషనర్ రజత్‌భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు.
మర్రిపాలెం స్పెన్సర్స్, లక్ష్మీనగర్తోపాటు..మర్రిపాలెంలోని మల్కాపురం, శాంతిపురం మద్యం దుకాణాల్లోని సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్లు నకిలీ రసీదులతో నగదు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు.
ఇదీ చదవండి: