రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. అయితే కొన్ని అత్యవసరమైన పరిశ్రమలకు మాత్రం ప్రత్యేక అనుమతుల ద్వారా ఉత్పత్తి చేసేందుకు అధికారులు అనుమతులిచ్చారు. పారిశ్రామిక నగరంగా పేరొందిన విశాఖలో ఫార్మా పరిశ్రమలు తమ ఉత్పత్తిని కొనసాగిస్తున్నాయి. ఆయా సిబ్బందికి పరిమిత సంఖ్యలో పాసులు జారీ చేసినట్లు ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ రామలింగేశ్వరరాజు తెలిపారు. ముఖ్యంగా కరోనా బాధితులకు చికిత్స అందించడంలో వెంటిలేటర్ల కొరత రాకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు. విశాఖలో వైద్య పరికరాల తయారీ కేంద్రం మెడ్‌టెక్ పార్కులో వెంటిలేటర్లు తయారు కానున్నట్లు చెప్పారు. వైద్య సేవలకు అవసరమయ్యే ఉత్పత్తులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రానివ్వబోమన్న రామలింగేశ్వరాజుతో మా ప్రతినిధి ముఖాముఖి.
ఇదీ చూడండి: