కార్గిల్ యుద్దం భారత సైనిక దళాలకు కొత్త వ్యూహాలతో పోరుకు నాంది పలికింది. త్రివిధ దళాలు బహుముఖ వ్యూహాంతో విజయం సాధించ వచ్చునని నిరూపించాయి. హిమాలయాల్లో పదాతిదళం కీలకంగా ప్రధాన పాత్ర పోషించినా, అటు వాయు, ఇటు నౌకా సేనలు అనుబంధపాత్రలు సమర్థంగా నిర్వహించాయి.
యుద్ధ వ్యూహాల్లో ఆరితేరిన భారత యుద్ధ తంత్ర నిపుణులు రచించిన వ్యూహాం పూర్తిగా బయటకు వెల్లడికాకపోయినా త్రివిధ దళాలను ఇందులో చేర్చారన్నది విశ్రాంత సైనికాధికార్ల విశ్లేషణ. నౌకాదళం పరంగా చూస్తే ఒకవైపు హిమాలయాల్లో యుద్దం జరుగుతుంటే మరో వైపు తూర్పు, పశ్చిమ, దక్షిణ నౌకాదళాల్ని పూర్తిగా అప్రమత్తం చేశారు. విశాఖ కేంద్రంగా దాదాపు మూడు జలాంతర్గాములు ఏక్షణమైనా ఎటైనా వెళ్లేందుకు సిద్ధం చేశారు. కార్గిల్ యుద్ధం నాటికి విశాఖలోని ఐఎన్ఎస్ కళింగ కేంద్రంగా మెరైన్ కమాండో బృందం ఏర్పాటు చేసి ఐదేళ్లు మాత్రమే అయింది. ఈ శైశవ దశలో ఉన్న మెరైన్ కమాండ్ బృందాన్ని పూర్తి అప్రమత్తంతో కీలక ప్రదేశాల్లో సిద్ధంగా ఉంచారు.
నౌకాదళానికి చెందిన చేతక్ లాంటి ఎనిమిది విమానాలను అతి శీతల ప్రదేశాల్లో మన సైనికులకు సాయంగా మోహరించారు. వీటన్నింటిలోనూ తూర్పు నౌకాదళం నుంచి పెద్ద ఎత్తున నావికులను, సాంకేతిక నిపుణులను కీలక స్థావరాలకు తరలించారు.
కార్గిల్ యుద్ధంలో నౌక దళానిది ఓ పాత్ర - navy
పాకిస్థాన్‌తో 20 ఏళ్ల క్రితం జరిగిన కార్గిల్ యుద్ధంలో...భారత్ విజయబావుటా ఎగురేసింది. పాకిస్తాన్ - భారత్‌ల మధ్య జరిగిన ఈ యుద్ధం చరిత్రలో నిలిచిపోయేది. ఈ యుద్ధంలో భారత్ త్రివిధ దళాలను ఉపయోగించింది. అప్పటి మన విశాఖ నౌక దళ అధికారులు సైతం ఈ యుద్ధంలో పాల్గొన్నారని చెబుతారు విశ్రాంత సైనికాధికారులు.