సముద్రంలో చిక్కుకుని సాయం కోసం ఎదురుచూస్తున్న శ్రీలంక మత్స్యకారులను భారత్ కోస్ట్ గార్డ్ రక్షించింది. విశాఖ వైపు వస్తున్న మర్చంట్ నేవీ నౌక ఎం.వి.సుమిత్లోని సిబ్బంది... సముద్రంలో కొంత మంది ప్రమాదంలో ఉన్న విషయాన్ని గుర్తించారు. సమాచారాన్ని కోస్ట్ గార్డ్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌కి అందించారు. ఆరుగురు శ్రీలంక మత్స్యకారులను ప్రాణాపాయం నుంచి కాపాడారు. వారిని శ్రీలంకకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని నేవీ అధికారులు తెలిపారు. చెన్నైకి తూర్పుగా 170 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది.




ఇదీ చదవండి: 'కరోనా పరీక్షల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్'