Marijuana seizure: అక్రమంగా భారీ స్థాయిలో గంజాయిని తరలిస్తూ పట్టుబడిన 9మంది నిందితులను పాడేరు జిల్లా ముంచంగిపుట్టు పోలీసులు కోర్టుకు తరలించారు. గురువారం లబ్బురు ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహించి 13 లక్షలు విలువచేసే 25 ప్యాకెట్లలోని 684 కేజీల గంజాయిని పట్టుకున్నారు. పట్టుబడ్డ గంజాయిని లక్ష్మీపురం నుంచి ఒడిశాకు తరలిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితుల నుంచి జీపు, బొలెరోలతో పాటు ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాతో సంబంధం ఉన్న మరో ఏడుగురిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.
ఇవీ చదవండి :