బకాయి పడ్డ జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ డ్రైనేజీ క్లీనింగ్ వర్కర్స్ విశాఖలో చేపట్టిన ఆందోళన.. ఐదో రోజుకు చేరుకుంది. ఐదు నెలల నుంచి జీతాలు లేక తమ కుటుంబాలు పస్తులతో అలమటిస్తున్నా... అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ఆరు జోన్ లకు చెందిన సుమారు 150 మంది కార్మికులు పూర్తిస్థాయిలో విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. భూగర్భ డ్రైనేజీ లో వచ్చిన మలమూత్రాలను తమ చేతులతో శుభ్రపరిచి ప్రజల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న తమకు అధికారులు జీతాలు చెల్లించకపోవడం శోచనీయమని వాపోయారు. బకాయి పడ్డ జీతాలు చెల్లించే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి