ETV Bharat / city

సబ్బంహరి ఇంటి ప్రాంగణంలో నిర్మాణాలు కూల్చివేత - సబ్బం హరీ ఇంటి ప్రహారీపై జీవీఎంసీ యాక్షన్ న్యూస్

తెలుగుదేశం నేత, మాజీ ఎంపీ సబ్బం హరి నివాస ప్రాంగంణంలోని కొంతమేర నిర్మాణాలను విశాఖ నగరపాలక సంస్థ సిబ్బంది కూల్చివేశారు. రహదారి ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ శనివారం తెల్లవారుజామునే పెద్ద ఎత్తున జీవీఎంసీ సిబ్బంది పోలీసుల సాయంతో తొలగించారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా కూల్చివేతకు పాల్పడ్డారంటూ సబ్బంహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై చంద్రబాబు సహా తెలుగుదేశం, భాజపా నేతలు మండిపడ్డారు.

సబ్బంహరి ఇంటి ప్రాంగణంలో నిర్మాణాలు కూల్చివేత

author img

By

Published : Oct 3, 2020, 5:11 PM IST

సబ్బంహరి ఇంటి ప్రాంగణంలో నిర్మాణాలు కూల్చివేత

మాజీ ఎంపీ సబ్బంహరి నివాస ప్రాంగణంలోని నిర్మాణాలను జీవీఎంసీ సిబ్బంది కూల్చివేశారు. 5 అడుగుల మేర రహదారి స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ యంత్రాలతో ప్రహరీ సహా నిర్మాణాలను తొలగించారు. శనివారం తెల్లవారుజామునే పోలీసులతో తరలివచ్చిన సిబ్బంది, కూల్చివేతకు సిద్ధమవ్వగా.. సబ్బంహరి అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కొంత ఉద్రిక్తత తలెత్తింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతకు ప్రయత్నిస్తున్నారంటూ సబ్బంహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు మాత్రం నోటీసులు ఇచ్చామని చెబుతూ 5 అడుగుల రహదారి మేర కంచె వేశారు.

విశాఖ సీతమ్మధారలోని సబ్బంహరి ఇళ్లు... 4 ప్లాట్లు కలిపి ఐదు అడుగుల రహదారి కోసం స్ధలాన్ని వదిలినట్టుగా ప్లాన్ లో ఉంది. ఈ నాలుగు ప్లాట్లను సబ్బం హరి కొనుగోలు చేశారు. అవతలి వైపు పార్కు ఉండటంతో రహదారి కొనసాగింపు లేదు. దీంతో ఆయన పార్కు ప్రహరీని అనుసంధానిస్తూ వాచ్‌మెన్‌తోపాటు, సందర్శకుల కోసం టాయిలెట్లు నిర్మించారు. రహదారిలో నిర్మాణాలు ఎలా చేపడతారంటూ జీవీఎంసీ అధికారులు తొలగింపు ప్రక్రియ చేపట్టారు. 4 ప్లాట్లు తనవేనని...ఆ రహదారికి చివరివైపున ఇంకెవరి స్థలాలు లేనందున అది ఎవరికీ ఉపయోగం లేదని సబ్బంహరి అధికారులకు వివరించే ప్రయత్నం చేశారు.

సబ్బంహరి ఇంటి నిర్మాణాలు కూల్చడంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కక్షపూరిత రాజకీయాలు మంచిది కావని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ 'యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్'తో బాధపడుతున్నారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. విధ్వంసం తప్ప అభివృద్ధి జగన్ పాలనలో లేదని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. అమరావతిలో ప్రారంభమైన విధ్వంసం విశాఖ చేరుకుందన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. సబ్బంహరి నివాసానికి వెళ్లి పలువురు తెలుగుదేశం, భాజపా నేతలు ఆయన్ను పరామర్శించారు.

ఇదీ చదవండి:

సబ్బంహరి ఇంటిని కూల్చడంపై అంత సైకోయిజం ఏంటి?: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.