ETV Bharat / city

సాగర నగరానికి.. సరికొత్త హంగులు - విశాఖలో లైట్ మెట్రో న్యూస్

విశాఖపట్నంలో లైట్‌ మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 140 కిలోమీటర్ల మేర లైట్‌ మెట్రో, ట్రామ్‌ కారిడార్ల ఏర్పాటుకు డీపీఆర్‌ల తయారీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీపీఆర్‌ల తయారీకి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రైట్స్‌, డీఎంఆర్సీ ముందుకొచ్చాయి. రెండు దశల్లో లైట్‌ మెట్రో కారిడార్‌, 3 కారిడార్లుగా ట్రామ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సాగర నగరానికి.. సరికొత్త హంగులు
సాగర నగరానికి.. సరికొత్త హంగులు
author img

By

Published : Feb 26, 2020, 8:22 PM IST

సాగర నగరానికి.. సరికొత్త హంగులు

విశాఖలో 140 కిలోమీటర్ల పరిధిలో లైట్‌ మెట్రో, ట్రామ్‌ వ్యవస్థల ఏర్పాటు దిశగా..... ప్రభుత్వం మరో అడుగు వేసింది. డీపీఆర్​ల రూపకల్పన కోసం కొటేషన్లు ఆహ్వానించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన రైట్స్‌, డీఎంఆర్​సీ.. డీపీఆర్​ సమర్పించేలోగా టెండర్లు పిలిచేందుకు అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ సన్నాహాలు చేస్తోంది.

భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానం

విశాఖలో లైట్‌ మెట్రో రైలు, ట్రామ్‌ వ్యవస్థలను ఏర్పాటు చేసి... నూతనంగా ప్రతిపాదించిన భోగాపురం విమానాశ్రయానికి వాటిని అనుసంధానించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా అనకాపల్లి నుంచి భోగాపురం వరకూ లైట్‌ మెట్రో కారిడార్‌.. విశాఖలోని పాత పోస్టాఫీసు నుంచి భీమిలి వరకూ ట్రామ్‌ వ్యవస్థ ఏర్పాటుకు...... ప్రణాళికలు రచిస్తోంది. 140 కిలోమీటర్ల మేర ఉండనున్న ఈ వ్యవస్థల ఏర్పాటుకు అమరావతి మెట్రోరైల్‌ కార్పొరేషన్‌... డీపీఆర్​ల కోసం కొటేషన్లు ఆహ్వానించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సుముఖత చూపినట్టు తెలుస్తోంది.

దశల వారీగా..

దశల వారీగా లైట్ మెట్రో కారిడార్‌ను... 3 కారిడార్లుగా ట్రామ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి.... గాజువాక, తాటిచెట్లపాలెం, ఆనందపురం కూడలి మీదుగా భోగాపురం విమానాశ్రయం వరకూ 80 కిలోమీటర్ల మేర లైట్ మెట్రో కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని పాత పోస్టాఫీసు నుంచి.. ఆర్కే బీచ్‌, రుషికొండ మీదుగా భీమిలి వరకూ ట్రామ్‌ కారిడార్‌ వ్యవస్థ ఏర్పాటుకు యోచిస్తున్నారు. అనకాపల్లి నుంచి స్టీల్‌ప్లాంట్‌ వరకూ ఒకటి... ఎన్​ఏడీ కూడలి నుంచి పెందుర్తి వరకూ మరొకటి... మొత్తం మీద జిల్లాలో 3 ట్రామ్‌ కారిడార్లు ఉండేలా ప్రణాళిక రచించారు. ఈ ప్రతిపాదిత కారిడార్లలో... వివిధ రవాణా వ్యవస్థల ద్వారా గంటకు 5 వేల మంది వరకూ ఒకవైపున ప్రయాణిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.

అంచనా రూ.300 కోట్లు

లైట్‌ మెట్రో కారిడార్‌ ఏర్పాటుకు కిలోమీటరుకు రూ.200 కోట్లు.. ట్రామ్‌ వ్యవస్థకు రూ.100 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి:

సీఎం జగన్​ను​ కలిసిన సినీ నిర్మాతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.