ETV Bharat / city

BEACH CORRIDOR: విశాఖ బీచ్ కారిడార్​లో పర్యాటకం పరుగులు.. అభివృద్ధికి సర్కారు చర్యలు - development vizag beach corridor

విశాఖ బీచ్ కారిడార్‌లో ప్రపంచ స్థాయి రిసార్టులు, సాహస క్రీడా కార్యకలాపాలను పర్యాటక శాఖ అభివృద్ధి చేయనుంది. భీమిలి, భోగాపురంలో సీప్లేన్ టెర్మినల్స్‌తో పాటు ఎకో - టూరిజం, ఫ్లోటింగ్ రెస్టారెంట్‌ల అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నారు. తెన్నేటి పార్క్ సమీపంలో చిక్కుకుపోయిన బంగ్లాదేశ్ షిప్‌ను పదిన్నర కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పర్యాటక హోటల్‌గా మార్చనున్నారు.

విశాఖ బీచ్ కారిడార్‌లో పర్యాటకం అభివృద్ధికి సర్కారు చర్యలు

author img

By

Published : Aug 28, 2021, 3:24 PM IST

విశాఖ బీచ్ కారిడార్‌లో పర్యాటకం అభివృద్ధికి సర్కారు చర్యలు

సాగర తీర నగరం విశాఖలో పర్యాటక అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. పర్యాటక శాఖ కొత్తగా ప్రతిపాదించిన అంశాలపై ఆ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ భార్గవ సమీక్షించారు. చాలా ప్రాజెక్టులు ఇప్పుడు పట్టాలు ఎక్కేందుకు అవకాశం కలిగింది. 163 కోట్ల వ్యయంతో పీపీపీ పద్ధతిలో తోట్లకొండ వద్ద టన్నెల్ అక్వేరియం అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. కైలాసగిరి నుంచి భోగాపురం వరకు బీచ్ కారిడార్ వెంబడి దీన్ని అభివృద్ధి చేయనున్నారు.

అత్యాధునిక వసతులు..

సాగర్ నగర్, తిమ్మాపురం, మంగమారిపేట, చేపల ఉప్పాడ, ఎర్రమట్టి దిబ్బలు, భీమునిపట్నం, నగరంపాలెం, అన్నవరం, కంచర్లపాలెం బీచ్‌లలో వాష్‌రూమ్‌లు, తాగునీరు, ఫుడ్ కోర్టులు, సిట్టింగ్ బెంచీలు, రెక్లినర్‌లతో సిట్‌ - అవుట్ గొడుగులు, పిల్లల పార్క్, ఫిట్‌నెస్ సామగ్రి, జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్ జోన్, బీచ్ స్పోర్ట్స్, వాచ్ టవర్, పార్కింగ్, ప్రథమ చికిత్స కేంద్రాలు , సీసీ టీవీ కంట్రోల్ రూమ్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వంటి వసతులు కల్పిస్తారు.

పర్యాటక హోటల్​గా బంగ్లాదేశ్ షిప్..

భీమిలి, భోగాపురం బీచ్‌లో సీప్లేన్ టెర్మినల్స్ ఏర్పాటు చేస్తారు. అటవీ భూమిని ఆనుకుని ఉన్న తీరంలో పర్యావరణ పర్యాటక ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తారు. పదిన్నర కోట్ల రూపాయల అంచనా వ్యయంతో విశాఖ తెన్నేటి పార్క్ సమీపంలో చిక్కుకుపోయిన బంగ్లాదేశ్ నౌక ఎమ్​వీ. మా కార్గోను పర్యాటకుల కోసం సిద్ధం చేస్తారు. ఇందులో హోటల్‌, రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయనున్నారు.

ఇదీ చదవండి:

విషాదం: రైలు ఢీకొని ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.