ETV Bharat / city

హరిత విశాఖ లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు

విశాఖ అంటే సముద్రతీర అందాలే కాదు... పచ్చని హరితకాంతులు గుర్తుకువస్తాయి. స్వచ్ఛత, పరిశుభ్రత అంశాల్లో ఎప్పుడూ దీటుగా నిలబడే సాగర నగరి.. పచ్చదనం విషయంలోనూ మరింత ప్రత్యేకంగా నిలిచే దిశగా సన్నద్ధమవుతోంది. నగరాన్ని పూర్తిగా హరితమయం చేస్తే మరింత కాలుష్యాన్ని అరికట్టడమే కాదు... రెట్టింపు ఆహ్లాదాన్ని కలిగించే వాతావరణాన్ని పొందవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి.

Government plans to target green Vishakha
హరిత విశాఖ లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు
author img

By

Published : Nov 21, 2020, 4:39 AM IST

హరిత విశాఖ లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు

విశాఖకు సహజసిద్ధంగా నగరంలోనే అడవుల్ని తలపించే వాతావరణం ఉండడం ఒక అద్భుతం. వేల ఎకరాల్లో దట్టంగా విస్తరించి ఉన్న పచ్చదనంతో కంబాలకొండ వైల్డ్​లైఫ్ శాంక్చరీ ఉంది. ఎటు చూసినా పచ్చని కొండలు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక నగరంలోని రహదారులపైనా ఎత్తైన చెట్లు కనిపిస్తుంటాయి.

కానీ పారిశ్రామికంగా, శరవేగంగా విస్తరిస్తున్న నగరంగా పేరున్న విశాఖకు మరింత పచ్చదనం అవసరం. ఆ దిశగా ప్రజల భాగస్వామ్యం ఉంటే సాగర నగరిని మరింతగా హరితశోభతో అలంకరించవచ్చు. అందుకే జీవీఎంసీ, వీఎంఆర్డీఏ సహా అటవీ శాఖ అధికారులు పచ్చదనాన్ని అభివృద్ధి చేయడానికి విభిన్న మార్గాల్లో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే అనేక ఆలోచనల్ని అమలు చేశారు. వేల సంఖ్యలో సీడ్ బాల్స్​ను కొండలపై చల్లే కార్యక్రమాన్ని జీవీఎంసీ ఇటీవల చేపట్టింది.

ఉద్యానవనాల్ని మరింత పచ్చగా తీర్చిదిద్దడంతోపాటు వైవిధ్యం ఉట్టి పడే రీతిలో రకరకాల చెట్లను అక్కడ పెంచాలని వీఎంఆర్డీఏ యోచిస్తోంది. ప్రజలకు తక్కువ రేటుకు పదుల రకాల మొక్కలను అందించేందుకు వీఎంఆర్డీఏ నర్సరీ సిద్ధంగా ఉంది. విశాఖ ప్రజలు పెద్ద ఎత్తున తమ నివాసాలు, కార్యాలయాల వద్ద అవకాశం ఉన్న ప్రతి చోటా మొక్కలు నాటాలని అధికారులు పిలుపునిస్తున్నారు. కనీసం ఒక్కరు ఒక్క మొక్కనైనా నాటి సంరక్షించాలని కోరుతున్నారు.

ప్రస్తుత కార్తిక వన మహోత్సవాల వేళ ప్రజలకు పచ్చదనంపై అవగాహన కలిగించే ప్రయత్నాలను ప్రభుత్వం చేస్తోంది. ప్రజలను చైతన్యపరిచి హరిత శోభను పెంచగలిగితే నగరాలు ఆహ్లాదంగా ఉండడమే కాకుండా ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని నిపుణులంటున్నారు.

ఇదీ చదవండీ... ప్రకాశం జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.