విశాఖ నగరంలో గ్యాంగ్ వార్ మళ్లీ మొదలైంది. చాలా కాలం పాటు తెరవెనక్కు వెళ్లిపోయిన ముఠాలు మళ్లీ చురుగ్గా దందాలు చేస్తున్నాయి. ప్రత్యర్థులను హతమార్చేందుకు ఆయుధాలతో బహిరంగంగానే తిరుగుతున్నాయి.
తాజాగా.. ఖాసిం (చనిపోయిన రౌడీషీటర్) ముఠాలోని కీలక వ్యక్తులను మట్టుబెట్టేందుకు చిట్టి మాము(రౌడీషీటర్) గ్యాంగ్ సభ్యులు చేసిన ప్రయత్నాన్ని టాస్క్‌ఫోర్సు పోలీసులు అడ్డుకున్నారు.
మారణాయుధాలతో వెళ్తున్న వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. నగరంలో గ్యాంగ్ వార్ ఏ స్థాయిలో ఉందో బయటపడింది. వీరిపై కంచరపాలెం పోలీస్‌స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు.
ఇవీ చదవండి: