ETV Bharat / city

అడ్డగోలుగా ఉద్యోగాలిస్తామంటే ఉద్యమిస్తాం: బండారు - tdp leader bandaru satyanarayana news

విశాఖ ఫార్మాసిటీలో వైకాపా సోషల్ మీడియా కార్యకర్తలకు ఉద్యోగాలు కల్పిస్తామన్న ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ స్థానికులకు ద్రోహం చేయడమేనని దుయ్యబట్టారు.

tdp leader bandaru satyanarayana
tdp leader bandaru satyanarayana
author img

By

Published : Dec 7, 2020, 4:51 PM IST

విశాఖలో వైకాపా సోషల్ మీడియా కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా కార్యకర్తలకు ఉద్యోగాలు కట్టబెడతానని ఎంపీ విజయసాయి అనడం దారుణమని అన్నారు. పరవాడ ఫార్మా సిటీలోని పరిశ్రమల్లో వైకాపా సోషల్ మీడియా కార్యకర్తలకు 2 వేల ఉద్యోగాలు ఇస్తానని ఎంపీ చెప్పడం స్థానికులకు ద్రోహం చేయడమేనని స్పష్టం చేశారు.

విశాఖలో ఫార్మా సిటీ నిర్మాణ సమయంలో భూములు కోల్పోయిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అడ్డగోలుగా ఉద్యోగాలు ఇస్తామంటే ఉద్యమం చేస్తామని చెప్పారు. స్థానికేతరులకు ఆదరిస్తూ విశాఖ వాసుల నోటిలో మట్టికొట్టే పని చేయకూడదని బండారు చెప్పారు.

ఇదీ చదవండి

'ఏలూరు ఘటనపై అధ్యయనానికి ముగ్గురు సభ్యుల కేంద్ర కమిటీ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.