విశాఖలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులకు అంగలకుదురు ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు భోజనం పంపిణీ చేశారు. కన్ను, ముక్కు, చెవి, మానసిక, అంటువ్యాధుల ఆస్పత్రుల్లోని సుమారు 300 మందికి ఆహారం ప్యాకెట్లను అందించారు.
ట్రస్టు ఛైర్మన్ ఆచార్య అంగలకుదురు దుర్గాప్రసాద రావు.. తన సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కరోనా కష్టకాలంలో ఆకలితో ఇబ్బందులు పడుతున్న వారికి సాయం అందించటం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు, వి.వి. సత్యనారాయణ, ఏ.శ్రీనివాసులు, హిమచంద్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: