విశాఖకు ఈ నెల 16 నుంచి ఎనిమిది దేశాలకు చెందిన విమానాలు రానున్నాయి. వందే భారత్ మిషన్ 3లో భాగంగా ఈ విమానాలు విశాఖకు చేరుకుంటాయి. వివిధ దేశాల్లో కోవిడ్ కారణంగా చిక్కుకుపోయిన తెలుగు వారిని 12 విమానాల ద్వారా రప్పించనున్నారు. మంగళవారం రాత్రి తొలి విమానం వస్తుండగా.... ఈ నెల 29 వరకు వివిధ షెడ్యూళ్లలో విమానాలు వస్తాయి. ఫిలిప్పీన్స్, కిర్గీస్థాన్, రష్యా, ఉక్రెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, యూఏఈ, యూకే నుంచి విమానాలు రానున్నట్లు విశాఖ విమానాశ్రయ డైరెక్టర్ రాజా కిషోర్ తెలిపారు.
ఇదీ చూడండి..