విశాఖ తాజ్ గేట్‌వే హోటల్‌లో పారిశ్రామిక వేత్తల మొదటి వాణిజ్య సదస్సు జరిగింది. 'ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఫెడరేషన్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించింది. మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, ముత్తంశెట్టి శ్రీనివాస్ సదస్సు ప్రారంభించారు. రొయ్యలు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా పని చేస్తున్నామని మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పారు. సుగంధ ద్రవ్యాలు, ఖనిజాలు, ఫుడ్ ప్రాసెస్, వస్త్ర రంగాల్లో ఆదాయం పెంచుతామన్నారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు పెంచే దిశగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో నాణ్యమైన పరీక్ష కేంద్రాలు అవసరమని... ఈ అంశంపై కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని మంత్రి గౌతమ్‌రెడ్డి వివరించారు. సదస్సులో 30కి పైగా దేశాల ప్రతినిధులు, వందమందికి పైగా ఎగుమతిదారులు పాల్లొన్నారు. తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఎంపీ రఘురామకృష్ణంరాజు కార్యమానికి వచ్చారు.
ఇదీ చదవండి