విశాఖ కేజీహెచ్ వైద్యులు మరో ఘనతను నమోదు చేశారు. కరోనా సోకి.. వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న గర్భిణికి సిజేరియన్ చేసి పురుడు పోశారు. తల్లిని, బిడ్డను కాపాడారు. కేజీహెచ్ వైద్యురాలు డాక్టర్ ఎ.కవిత నేతృత్వంలోని బృందం సీఎస్ఆర్ బ్లాక్‌లో విజయవంతంగా శస్త్రచికిత్స చేసింది.
పది రోజులుగా వెంటిలేటర్‌పై ఉన్న కొవిడ్ బాధితురాలైన గర్భిణికి ఈ తరహాలో శస్త్ర చికిత్స నిర్వహించడం రాష్ట్రంలోనే ఇదే ప్రథమమని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు.
ఇదీ చదవండి: