ETV Bharat / city

ఆ మూడు నియోజకవర్గాల వైపు.... విశాఖ ప్రజల చూపు - tdp

విశాఖ జిల్లాలోని మూడు నియోజకవర్గాల ఫలితాల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ స్థానాలను కైవసం చేసుకున్న వారిదే విశాఖ పార్లమెంట్ సీటు అని అంచనా వేస్తున్నారు.

పవన్, గంటా, అవంతి
author img

By

Published : May 23, 2019, 4:51 AM IST

విశాఖ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ప్రస్తుతం ప్రధానంగా మూడింటిపైనే చర్చంతా నడుస్తోంది. గాజువాక, విశాఖ ఉత్తరం, భీమిలి స్థానాల్లో ఏ పార్టీ ప్రభావం అధికంగా ఉంటే ఆ పార్టీ ఖాతాలో లోక్‌సభ స్థానం పడే అవకాశం ఉంటుంది అన్నది విశ్లేషకుల మాట.
గాజువాక నుంచి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ బరిలో ఉన్నందున ఈ స్థానంపై సహజంగానే అందరి దృష్టీ ఉంది. రాజకీయ, సినీ ప్రముఖులు తీక్షణంగా గమనిస్తున్నారు. ఇక విశాఖ ఉత్తరం విషయానికొస్తే తెలుగుదేశం నుంచి మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన భీమిలి నుంచి గెలుపొందారు. ఈ దఫా విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేయడం ఎన్నికల ముందు కొన్ని అనూహ్య పరిణామాలు జరగడం వంటి విషయాలతో ఈ అసెంబ్లీ స్థానంపై పెద్ద చర్చలే సాగుతున్నాయి. గంటాశ్రీనివాసరావు ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. భీమిలిలో తెలుగుదేశం నుంచి సబ్బం హరి, వైకాపా నుంచి అవంతి శ్రీనివాసరావు వంటి కీలక నేతలు బరిలో ఉన్నారు. ఫలితంగా ఈ స్థానంపైనా అందరూ ఓ కన్నేశారు

ఆ మూడు ఎవరివి?

అందరిలోనూ గెలుపు ధీమా!

విశాఖ పార్లమెంటు స్థానం నుంచి బరిలో ఉన్న వారిలో భాజపా అభ్యర్థి పురందేశ్వరి తప్ప ఇతర ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ రాజకీయాలకు కొత్తే. తెలుగుదేశం అభ్యర్థి ఎమ్.శ్రీ భరత్, వైకాపా అభ్యర్థి సత్యనారాయణ, జనసేన అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణ ఎవరికి వారు గెలుపుపై ధీమాతో ఉన్నారు. గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పోటీ చేసినందున విశాఖ ఎంపీ స్థానంపై జనసైనికులు గట్టి ఆశలే పెట్టుకున్నారు. పారిశ్రామిక వాడతో పాటు నగరంలో యువత చాలా వరకూ వీవీ లక్ష్మీనారాయణ వైపు మొగ్గు చూపారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే సంప్రదాయ తెలుగుదేశం ఓటర్లు మాత్రం భరత్ గెలుపు ఖాయం అంటున్నారు. మరోవైపు జగన్ హవాతో ప్రజలు తనకే పట్టం కడతారన్నది వైకాపా అభ్యర్థి సత్యనారాయణ గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.