Football Court: క్రీడామైదానం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదా! ఈ మైదానం మాత్రం మీరనుకున్నట్లు ఉండదు. సరికొత్త రీతిలో ఐదంతస్తుల భవంతిపై దీన్ని ఏర్పాటు చేశారు. ఫుట్‌బాల్ శిక్షణ ఇచ్చేందుకు అంత ఎత్తులో.. ఫైబర్ పచ్చిక, చుట్టూ వలలతో ఏర్పాటు చేసిన ఈ ఆటస్థలం ఎంతగానో ఆకర్షిస్తోంది. విశాఖపట్నంలో వి.ఐ.పి. రోడ్డులో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ సంఘం సహకారంతో ఏర్పాటు చేసినట్లు కోచ్ వై.రమేష్ తెలిపారు. ఇక్కడ కిక్స్ నేర్చుకోవాలంటే ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో ఇచ్చే శిక్షణకు హాజరుకావాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: "ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాల్లో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు"