ప్రస్తుతం విశాఖ విమానాశ్రయం పూర్తిగా నేవీ ఆధీనంలోనే ఉండటంతో.. వారిచ్చిన ఖాళీ సమయాల్లోనే ఈ విమానాల్ని నడపాలి. వివిధ విమాన సంస్థల ప్రతిపాదనలపై ఇది వరకే నేవీ ఉన్నతాధికారులతో చర్చలు నడిచాయి. వారిచ్చిన ఖాళీ స్లాట్స్ ఆధారంగా అనువైన సమయాల్ని డీజీసీఏకి విమానాశ్రయ డైరెక్టర్ రాజకీషోర్ నివేదించారు. దాదాపు ప్రతిపాదనలన్నీ విశాఖ నుంచి నడిపేందుకు యోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. త్వరలో దీనిపై తుదినిర్ణయం తీసుకునే అవకాశముందని రాజకీషోర్ తెలిపారు
తిరిగి మామూలు రోజులు:
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అంతర్జాతీయ విమానాలపై ఇప్పటికీ నిషేధం కొనసాగుతోంది. ఎప్పటి నుంచి ఆ విమానాలు మొదలవుతాయనే అంశంపై స్పష్టత లేదు. ఇప్పుడొచ్చిన వేసవి ప్రతిపాదనలన్నీ కేవలం దేశీయంగా నడిపేవే. గతేడాది వేసవిలో విశాఖ నుంచి రోజువారీ సగటున 82 దేశీయ సర్వీసులు నడిచాయి. మళ్లీ ఆ సంఖ్యను ఈసారి చేరుకునే అవకాశాలున్నాయి.
ఇండిగో విమానాల వెల్లడి:
విశాఖ నుంచి నూతనంగా కర్నూలు (ఓర్వకల్లు), నాగ్‌పూర్‌కు.. మార్చి నుంచి రోజువారీ సర్వీసుల్ని ఇండిగో సంస్థ ప్రతిపాదించింది. ఉడాన్ పథకంలో భాగంగా తక్కువ టికెట్ ధరలతో కర్నూలుకు నడిపే విమానాన్ని ఇది వరకే ఇండిగో ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. విశాఖ-కర్నూలు మార్గంలో ప్రయాణం కేవలం 57 నిమిషాలే కాగా సమయాల్ని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. విశాఖ- రాజమహేంద్రవరం విమాన సర్వీసును.. మార్చి 28 నుంచి ఈ సంస్థ పునరుద్ధరించనుంది.
ఇదీ చదవండి: