ETV Bharat / city

రైల్వే ఈ-టిక్కెట్ల లోగుట్టు 'ఈ'యనకెరుక..! - railway fraud in visakha

రైల్వే తత్కాల్ టిక్కెట్లలో భారీ రాకెట్ తాజాగా వెలుగు చూడడం... హైటెక్ నేరాల మూలాలను పట్టుకునే అవసరాన్ని నిర్దేశిస్తోంది. అఖిల భారత స్థాయిలోనే ఈ తరహా రాకెట్ పని చేస్తోందన్న చేదు వాస్తవం రైల్వే నిఘా వర్గాలను విస్తుపోయేట్టుగా చేస్తోంది. విశాఖ రైల్వే రక్షక దళం ఈ-టిక్కెట్ల రాకెట్ కుంభకోణాన్ని ఛేదించినప్పటికీ.. మహా నగరాలల్లో జరిగే ఈ రకమైన మాయాజాలాన్ని అరికడితే తప్ప సాధారణ ప్రయాణికుడికి తత్కాల్ టిక్కెట్లు అందే పరిస్థితి లేదు.

e ticket fraud in visakha
ఈ-టిక్కెట్ల లోగుట్టు ఈయనకెరుక..!
author img

By

Published : Dec 13, 2019, 9:24 AM IST

ఈ-టిక్కెట్ల లోగుట్టు ఈయనకెరుక..!

అందివచ్చిన సాంకేతికత వికృత రూపం దాలుస్తూ... తత్కాల్ టిక్కెట్లను సామాన్యుడికి దూరం చేస్తోంది. అక్రమాలకు అలవాటు పడ్డ కొందరు టిక్కెట్ ఏజెంట్లు... కొత్త సాఫ్ట్​వేర్​ను వినియోగిస్తున్నారు. ఈ టిక్కెట్లను తీసి అధిక ధరలకు విక్రయించిన ఘటనలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. రైల్వే రక్షక దళం దీనిపై మరింత లోతుగా విచారించిన తర్వాత అతి పెద్ద రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఎ.ఎన్.ఎం.ఎస్ అనే సాఫ్ట్​వేర్ ద్వారా ఐఆర్​సీటీసీ వెబ్​సైట్​ను హ్యాక్ చేసి... తత్కాల్​లో వేగంగా ఈ-టిక్కెట్లను తీసుకుంటున్న లోగుట్టును విశాఖ రైల్వే రక్షక దళం కనుగొంది.

దాదాపు 14.83 లక్షల రూపాయల విలువైన టిక్కెట్లను ఒక్క రోజే తీసుకున్నట్టు ఆర్పీఎఫ్ ప్రత్యేక బృందం గుర్తించడం... ఈ దోపిడీ తీవ్రతకు అద్దంపడుతోంది. విశాఖ పారిశ్రామిక ప్రాంతమైన దువ్వాడలోని ఎస్పీ టూర్స్అండ్ ట్రావెల్స్​ను నడుపుతున్న కటక్ వాసి సమీర్ కుమార్ ప్రధాన్... ఒక ప్రత్యేకసాఫ్ట్​వేర్​తో ఐఆర్​సీటీసీ వెబ్​సైట్​ను హ్యాక్ చేయడం విస్మయానికి గురిచేస్తోంది. కొన్ని సెకన్లలోనే వందల సంఖ్యలో తత్కాల్ టిక్కెట్లను నకిలీ ఐడీల ద్వారా తీసుకోవడం... వాటితో ఒక్కో ప్రయాణికుడి వద్ద మూడు నుంచి నాలుగు వందల రూపాయలు వసూలు చేస్తున్నట్టు ఆర్పీఎఫ్ గుర్తించింది.

ఈ తరహాలో నేరం చేయడానికి పెద్దఎత్తున లాప్​టాప్​లు, డెస్క్​టాప్​లు వినియోగిస్తున్నట్టు ఆర్పీఎఫ్ గుర్తించింది. విశాఖలో జరిగినట్టుగా దేశవ్యాప్తంగా ఈ ప్రత్యేక సాఫ్టు్​వేర్ వినియోగిస్తున్నారని... మూలాలను కనుగోనేందుకు ఆర్పీఎఫ్ ప్రధాన కార్యాలయం వద్ద పెద్దఎత్తున కసరత్తు ఆరంభించింది. వాల్తేర్ డివిజన్ ఆర్ఫీఎఫ్ ఇన్స్​పెక్టర్లు పి.శ్రీనివాసరావు, ఆర్.కె.రావులతో కూడిన ప్రత్యేక బృందం... ఈ రాకెట్​ను గుర్తించి బయటపెట్టింది. నిందితుడు ఇచ్చిన సమాచారం ఈ తరహా నేరానికి కీలకం కావడంతో... అన్ని ప్రధాన స్టేషన్లకు పంపారు. దేశవ్యాప్తంగా ఎన్ని ముఠాలు వెలుగులోకి వస్తాయో చూడాలి మరి.

ఇదీ చదవండీ...

అంచనాల సవరణ కమిటీకి 'పోలవరం' నివేదిక

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.